హింసాత్మక హంతకుడిగా..
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్'. దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్‌కపూర్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ, జాకీష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తూ గౌరీఖాన్, మమతా ఆనంద్‌లతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’. దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్‌కపూర్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ, జాకీష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తూ గౌరీఖాన్, మమతా ఆనంద్‌లతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా మంగళవారం మేకర్స్ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఇంటెన్సిటీతోపాటు రొమాన్స్ టచ్ ఉన్న లుక్‌తో కనిపిస్తున్న షారుక్‌ఖాన్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. నిప్పులు చెరిగే కళ్లు, పెదాల మధ్య గులాబీ పువ్వు.. ఆయన పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో షారుక్ ఎలా కనిపించబోతున్నారో ఈ పోస్టర్ చూస్తే అవగతమవుతున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ పోస్టర్‌తో ఆ అంచనాలు రెట్టింపయ్యాయని మేకర్స్ అంటున్నారు. వయసు మీదపడ్డ హింసాత్మక హంతకుడిగా ఇందులో షారుక్‌ఖాన్ కనిపిస్తారని తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

