నాడు భరోసా.. నేడు నిరాశ
చిత్త కార్తె పోయింది.. స్వాతి చొరపడ్డది. దసరా సందడి ముగిసింది... పంటకంకి పాలు పట్టింది.. ఆకాశం వైపు చూస్తే కానరాని మబ్బులు ఆశల మీద నీళ్లు జల్లినయి. గుండెల్లో గూడు కట్టిన నిస్పృహతో, చెమ్మగిల్లిన కండ్లతో సర్కార్ దిక్కు చూస్తే.. ‘రాబోయే తొమ్మిది, పది నెలలు చాలా కష్టం.. కరెంటు లేదు.. నీళ్లు ఇవ్వలేం, పంట వేసుకోవద్దు’ అంటూ పాలకుని నోటి నుంచి వెలువడ్డ నిష్కర్ష మాటలు రైతు నెత్తిన పిడుగు పడ్డట్టు పడ్డయి.
చిత్త కార్తె పోయింది.. స్వాతి చొరపడ్డది. దసరా సందడి ముగిసింది… పంటకంకి పాలు పట్టింది.. ఆకాశం వైపు చూస్తే కానరాని మబ్బులు ఆశల మీద నీళ్లు జల్లినయి. గుండెల్లో గూడు
కట్టిన నిస్పృహతో, చెమ్మగిల్లిన కండ్లతో సర్కార్ దిక్కు చూస్తే.. ‘రాబోయే తొమ్మిది, పది నెలలు చాలా కష్టం.. కరెంటు లేదు.. నీళ్లు ఇవ్వలేం, పంట వేసుకోవద్దు’ అంటూ పాలకుని
నోటి నుంచి వెలువడ్డ నిష్కర్ష మాటలు రైతు నెత్తిన పిడుగు పడ్డట్టు పడ్డయి. విపత్తులు అనేవి సమాజాన్ని అభద్రతా భావంలోకి నెట్టేసి, సామూహిక ఆందోళనలకు పురిగొల్పే ఉత్పాతాలు.
ఇటువంటి విపత్కర అనిశ్చితిలో పాలకుడు వ్యవస్థల పరిమితులకు, ఖర్చుల లెక్కలకు ఆవల నిలబడి ప్రజలకు ‘మానసిక రక్షణ కవచం’ నిర్మిస్తాడా? లేక యుద్ధం మొదలవక ముందే
చేతులెత్తేసి పలాయనవాదం చిత్తగిస్తాడా? అనే అంశమే ఆయన మానసిక పరిపక్వతను, నాయకత్వ స్వభావాన్ని, ప్రజల పట్ల దృక్పథాన్ని నిర్ధారిస్తుంది.
తెలంగాణ రాజకీయ యవనికపై కరోనా మహమ్మారి వేళ కేసీఆర్ అనుసరించిన సంక్షోభ పరిష్కార మనస్తత్వం, నాయకత్వం, నేటి ఎల్ నినో, కరువు పరిస్థితుల్లో ఇప్పటి పాలకులు అవలంబిస్తున్న ఆత్మరక్షణ నాయకత్వ వైఖరి మధ్య ఉన్న అంతరాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మహమ్మారి ప్రబలినప్పుడు ప్రాణభయం మనిషిని కుంగదీస్తే, కరువు వచ్చినప్పుడు పంట నష్టం, అప్పులు, కుటుంబ పోషణపై కలవరం, సామూహిక భయాందోళనలను తీవ్రతరం చేస్తయి. ఇలాంటి సమయంలో పాలకుని నుంచి వచ్చే సందేశం ప్రజలకు ప్రమాద తీవ్రతను తట్టుకునేందుకు ఆత్మైస్థెర్యాన్ని ఇచ్చేందుకు దోహదపడుతాయి.
కరోనా విలయతాండవం చేసిన 2020, 2021 నాటి విపత్కర పరిస్థితులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువలేరు. ప్రపంచమంతా మరణభయంతో వణికిపోయింది. అంతర్జాతీయ వైద్య సంస్థలే చేతులెత్తేసి, భూగోళమంతా శవాల దిబ్బలుగా మారుతుందన్న నివేదికలు ప్రాణభయాన్ని తీవ్రతరం చేసినప్పుడు, అసెంబ్లీ వేదికగా, విలేకరుల సమావేశాల ద్వారా కేసీఆర్ ఇచ్చిన భరోసా జననాడికి సాంత్వననిచ్చే ఔషధంలా పనిచేసింది. ‘ఎంత ఖర్చయినా వెనుకాడం, వేయి కోట్లయినా పెడుతాం. ఎంత మందికైనా చికిత్స చేసే ఆక్సిజన్ పడకలు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది’ అని అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన మాటల్లో ప్రజలకు వినిపించింది చిట్టా పద్దుల గణాంక ప్రదర్శన కాదు. తమను ప్రభుత్వం ఒంటరిగా వదిలిపెట్టదనే భరోసా. ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనే సందేశం. ఇదే ప్రజల్లో ఆత్మైస్థెర్యాన్ని పెంచింది.
రాజకీయ మనస్తత్వశాస్త్రంలో సంక్షోభ సమయాల్లో ప్రజల భయాన్ని అదుపులో ఉంచి, వారిలో భద్రతా భావాన్ని పెంపొందించే నాయకత్వాన్ని సైకలాజికల్ కాన్సైన్మెంట్గా అభివర్ణిస్తారు. ప్రమాదాన్ని అంగీకరిస్తూనే, దాన్ని ఎదుర్కొనే శక్తి తమకు ఉన్నదనే నమ్మకాన్ని ప్రజల్లో నిలబెట్టడం దీని అసలు సారాంశం.
విపత్తును ప్రజల సమస్యగా మాత్రమే చూడకుండా.. ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించడమే కేసీఆర్ వైఖరి. ఇప్పుడు మాత్రమే కాదు. తెలంగాణ తెస్తానని ఇంత సద్దిమూట కట్టుకొని సిద్దిపేట నుంచి బయలుదేరిన నాడు ‘పిడికెడంత లేడు.. పిట్టపిల్లకు కొరగాడు.. ఈయినె తెలంగాణ తెత్తడట’ అని మూతులు తిప్పుకొన్నప్పుడు తొణకకుండ, ప్రతికూలతల మధ్య లక్ష్యంపై నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, ఇతరుల్లో ఆ నమ్మకాన్ని రగిలించడంలోనూ కేసీఆర్‌ది ఇదే భావోద్వేగ స్థిరత్వం.తెలంగాణ చేతికి అందిన నాడు రాష్ట్రమంతటా సాగు సంక్షోభం, జల సంక్షోభం, కరెంట్ సంక్షోభం, బతుకు సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నది. ఆ నేపథ్యంలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగించారు… ‘మనకు నీళ్లు లేకపోతే జీవితం లేదు, రాష్ట్రమే లేదు, బతుకే లేదు. తాగునీళ్లకైనా, సాగునీళ్లకైనా, పరిశ్రమలకైనా, గృహావసరాలకైనా నీళ్లు కావాలి. కాబట్టి నీళ్లు తేవాలి. దానికి ఎంత ఖర్చవుతుంది? ఎంత అప్పవుతుంది? అవన్నీ అర్థం పర్థం లేని మాటలు అధ్యక్షా! ప్రజల మనుగడ దృష్ట్యా ప్రభుత్వాలు ప్రాధాన్యతలను మార్చుకోవాలి. తెలంగాణకు ఎత్తిపోతల సాగునీటి పథకాలు తప్ప వేరే మార్గం లేదు. రైతులు ధనిక రైతులు అయ్యేవరకు, అప్పుల బాధ తీరేవరకు ఉచిత కరెంట్ ఇస్తాం, ఉచితంగానే ఎత్తిపోతల నీళ్లు ఇస్తాం, పెట్టుబడి అందిస్తాం’ అనే ఆలోచన నీటి కొరతను ప్రకృతి విధించిన శిక్షగా అంగీకరించి కూర్చోవడం కాకుండా, దాన్ని అధిగమించటం ప్రభుత్వ బాధ్యతగా చూడాలన్నది ఆయన వైఖరిలోని రాజకీయ అంతరార్థం.
2014లో 80 లక్షల ఎకరాలున్న సాగు విస్తీర్ణం 2022-23 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నులకు ఎగబాకింది. మిషన్ కాకతీయ కింద వేలాది చెరువుల పునరుద్ధరణ జరిగింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి సంక్షేమ రక్షణ వలయం రైతులో ఒక బలమైన మనోైస్థెర్యాన్ని నిర్మించాయి. ఏం జరిగినా ప్రభుత్వం తమ వెనుక ఉన్నదనే ఆ ధీమా, కరోనా కాలంలో మరింత స్పష్టంగా కనిపించింది. కరోనా వేళ కేసీఆర్ ఆలోచన, దిశానిర్దేశంతో పటిష్టమైన కార్యాచరణ అమలు జరిగింది. వైద్య రంగానికి యుద్ధప్రాతిపదికన రూ.1,000 కోట్లు, 28,000కు పైగా ఆక్సిజన్ పడకలు, ప్రైవేట్ దోపిడీని అడ్డుకునే ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. లాక్డౌన్ వేళ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తున్న రాష్ర్టాల్లో రైతులు రోడ్లపై పడి అలమటిస్తే.. తెలంగాణలో కేసీఆర్ సంస్కరణలు గ్రామదేవతలై రైతులను కాపాడుకున్నయి.
6,400కు పైగా కొనుగోలు కేంద్రాలు పెట్టి గ్రామాల్లోనే ధాన్యం కొన్నారు. 87.59 లక్షల ఆహార భద్రత కార్డుదారులకు మనిషికి 12 కేజీల బియ్యం, కుటుంబానికి రూ.1,500 నగదు సాయం అందించారు. 3.35 లక్షల మంది వలస కార్మికులను గుర్తించి బియ్యం, నగదు అందించి ఆదుకున్నారు. సంక్షోభాల వేళ ప్రజలను ఆదుకోవడంలో ‘సంరక్షక నాయకత్వాన్ని’ మించిన రాజనీతి లేదని నిరూపించారు.
కానీ అందుకు భిన్నమైన ధోరణి నేడు కరువు పరిస్థితులపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో కనిపిస్తున్నది. ‘తాగటానికే నీళ్లు లేవు.. వ్యవసాయానికి ఏడ తేము’ అని ముందుగానే తేల్చిచెప్పడం ఆత్మరక్షణ వైఖరిని, పరిపాలనాపరమైన నిస్సహాయతను బయటపెట్టింది. పంట చేతికొచ్చే దశలో ఉన్న రైతుకు ఈ మాటలు శరాఘాతాలు. పంట చేతికొచ్చే దశలో ఉన్న రైతుకు సాగునీటి లభ్యతపై ప్రభుత్వం నుంచి వినిపించాల్సింది నిరాకరణ ప్రకటన మాత్రమేనా? అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, పంటల అవసరాలు, ప్రాజెక్టుల నిర్వహణ, ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలపై సమగ్ర కార్యాచరణను ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?
రైతు పొలంలో పంట ఎండిపోతే నష్టం అతడి కుటుంబానికే పరిమితం కాదు. అప్పుల చెల్లింపులు, తదుపరి పంట పెట్టుబడి, కూలీల ఉపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ.. అన్నీ దాని ప్రభావానికి లోనవుతాయి. ఈ సామాజిక వాస్తవాన్ని గుర్తించిన పాలకుడు ముందుగానే భయాన్ని అనివార్యంగా ప్రకటించడు. ఇక్కడే డిఫెన్సివ్ లీడర్షిప్, లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ (పరిస్థితులను మార్చలేమనే నిస్సహాయ భావన) వంటి మనస్తత్వశాస్త్ర భావనలు చర్చకు వస్తాయి. సమస్యను పరిష్కరించేందుకు మార్గాలను అన్వేషించకుండా, పరిమితులను ముందుకు తెచ్చి బాధ్యతను తగ్గించుకునే ధోరణి ప్రజల్లో నిస్సహాయతను పెంచుతుంది. ముఖ్యంగా ప్రకృతిపై ఆధారపడి జీవించే రైతులకు పాలకుడి మాటలు భవిష్యత్తుపై ముందస్తు సంకేతాలుగా పనిచేస్తయి. ప్రభుత్వం ముందే చేతులెత్తేస్తే రైతులు మానసికంగా మరింత కుంగిపోతారు. దీనికి తోడు, కరోనా సమయంలో గత పాలకుడి మాటలను నమ్మినవారు ప్రాణాలు కోల్పోయారంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత కరువు సంక్షోభాన్ని పరిష్కరించే కార్యాచరణకు ప్రత్యామ్నాయం కాజాలవు. సంక్షోభం రాకముందే పరిమితుల చిట్టా విప్పి ప్రజలను నిస్సహాయతలోకి నెట్టేవారు పాలకుడి కుర్చీలో కూర్చున్న పలాయనవాదిగా మిగిలిపోతారు.
వర్ధెల్లి వెంకటేశ్వర్లు
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

