పవర్‌పేట పడమటవీధి జానకి
‘మిరాయ్' ‘కొరియన్ కనకరాజు’ చిత్రాల ద్వారా యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఒరిస్సా సొగసరి రితికా నాయక్. ఆమె సందీప్‌కిషన్‌తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘పవర్‌పేట’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. మంగళవారం రితికా నాయక్ పుట్టిన రోజు సందర్భంగా పడమటవీధి జానకిగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
‘మిరాయ్’ ‘కొరియన్ కనకరాజు’ చిత్రాల ద్వారా యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఒరిస్సా సొగసరి రితికా నాయక్. ఆమె సందీప్‌కిషన్‌తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘పవర్‌పేట’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. మంగళవారం రితికా నాయక్ పుట్టిన రోజు సందర్భంగా పడమటవీధి జానకిగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో ఈ భామ సంప్రదాయ వస్త్రధారణలో చూడముచ్చటగా కనిపిస్తున్నది. రాజకీయ నేపథ్యంలో ఆధిపత్య పోరు, ప్రేమ, గౌరవం ప్రధానాంశాలుగా చిత్రాన్ని రూపొందిస్తున్నామని, కథాగమనంలో పడమటవీధి జానకి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే అరవైశాతం చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, రచన-దర్శకత్వం: కృష్ణచైతన్య.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

