న్యూఢిల్లీ : ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ లీడర్ ఓఎల్ఎక్స్ గ్రూప్ లేఆఫ్స్ (OLX Layoffs) ప్రకటించింది. ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్ ఓఎల్ఎక్స్ ఆటోస్ కొన్ని ప్రాంతాల్లో ఒడిదుడుకులతో నడుస్తుండటంతో కంపెనీ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టింది. స్ధూల ఆర్ధిక వాతావరణం ప్రతికూలంగా మారడంతో ఈ ఏడాది ఓఎల్ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 1500 మంది ఉద్యోగులను తొలగిస్తుందనే అంచనాల నడుమ లేఆఫ్స్ నిర్ణయం వెలువడటం గమనార్హం.
కంపెనీ నుంచి వైదొలిగామని ఓఎల్ఎక్స్ ఆటో మెక్సికో ఉద్యోగులు ఇప్పటికే లింక్డిన్లో పోస్ట్ చేశారని వార్తలొచ్చాయి. లేఆఫ్స్ బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని ఓఎల్ఎక్స్ పేర్కొంది. టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్‌పై లేఆఫ్స్ ప్రభావం ఉందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కాగా అనిశ్చిత ఆర్ధిక వాతావరణం నెలకొన్న నేపధ్యంలో కొన్ని మార్కెట్ల నుంచి ఓఎల్ఎక్స్ ఆటోస్ నిష్క్రమించడం మేలని కంపెనీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.
దీటైన ఇన్వెస్టర్లు కొరవడటంతో అర్జెంటీనా, మెక్సికో, కొలంబియా మార్కెట్లలో ఒఎల్ఎక్స్ ఆటోస్ను మూసివేయాలని నిర్ణయించినట్టు కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఓఎల్ఎక్స్ ఆటో ఇండియా వెబ్సైట్ ఇప్పటికీ కొనసాగుతున్నది. ఓఎల్ఎక్స్ గ్రూప్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11,375 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఓఎల్ఎక్స్ మాతృసంస్ధ ప్రొసస్ వార్షిక నివేదికలో పేర్కొంది.
Read More :