హైదరాబాద్, మే 26: ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.139.21 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది వచ్చిన లాభంతో పోలిస్తే 77 శాతం వృద్ధిని కనబరిచింది. అలాగే ఆదాయం రూ.1,801.9 కోట్లుగా నమోదైందని పేర్కొంది.
ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం వల్లనే ఆర్థిక ఫలితాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని పేర్కొన్నారు.