Ola Roadster | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రోడ్‌స్టర్ (Roadster) ఉత్పత్తి మంగళవారం ప్రారంభమైంది. ఈ మేరకు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ (Bhavish Agarwal).. సోషల్ మీడియాలో పోస్టు చేసిన మోటార్ సైకిల్ ఫోటోపై ‘ఈ రోజు ఫ్యాక్టరీలో తొలి బైక్ తయారీ ప్రారంభమైంది’ అని క్యాప్షన్ రాశారు. ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ మూడు వేరియంట్లు – రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X), రోడ్‌స్టర్ (Roadster), రోడ్‌స్టర్ ప్రో (Roadster Pro) లభిస్తుంది. రోడ్‌స్టర్ ఎక్స్ రూ.74,999 (ఎక్స్ షోరూమ్), రోడ్‌స్టర్ రూ.1,04,999 (ఎక్స్ షోరూమ్), రోడ్‌స్టర్ ప్రో రూ.1,99,999 (ఎక్స్ షోరూమ్)లకు లభిస్తుంది. ఇప్పటికే న్యూ ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల నుంచి మోటారు సైకిళ్ల డెలివరీ ప్రారంభం అవుతుందని ఇంతకు ముందే ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ప్రకటించింది. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ రెండు కొత్త మోటార్ సైకిళ్లు – స్పోర్ట్‌స్టర్ (Sportster), యారోహెడ్ (Arrowhead)ఫోటోలను టీజ్ చేసింది.
ఓలా ఎలక్ట్రిక్ తీసుకొస్తున్న రోడ్‌స్టర్ (Roadster) మోటార్ సైకిళ్లలో రోడ్‌స్టర్ ప్రో (Roadster Pro) టాప్ వేరియంట్. ఈ మోటారు సైకిల్ విద్యుత్ మోటార్ గరిష్టంగా 52కిలోవాట్ల విద్యుత్, 105ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 16 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మోటార్ సైకిల్ 1.2 సెకన్లలో 40 కి.మీ, 1.9 సెకన్లలో 60 కిమీ వేగం అందుకుంటుంది. గంటకు గరిష్టంగా 194 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. 16కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ గల మోటారుతో సింగిల్ చార్జింగ్‌తో 579 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. రోడ్‌స్టర్ ప్రో (Roadster Pro) మోటారు సైకిల్ 10-అంగులాల టీఎఫ్టీ టచ్‌స్క్రీన్, యూఎస్డీ (అప్‌సైడ్ డౌన్) ఫోర్క్స్, టూ చానెల్ స్విచ్ఛబుల్ ఏబీఎస్ సిస్టమ్ విత్ డిస్క్ బ్రేక్స్ ఫ్రంట్ అండ్ రేర్ ఉంటాయి. ఈ మోటారు సైకిల్ హైపర్, స్పోర్ట్, నార్మల్, ఎకో మోడ్లలో లభిస్తుంది.
ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తీసుకొస్తున్నమోటార్ సైకిల్ మిడ్ వేరియంట్ రోడ్‌స్టర్ (Roadster). 13కిలోవాట్ల మోటార్‌తో వస్తున్న కమ్యూటర్ క్యాటగిరీ ఫాస్టెస్ట్ మోటార్ సైకిల్ ఇది. మూడు బ్యాటరీ ప్యాక్‌లు – 3.5కిలోవాట్లు, 4.5 కిలోవాట్లు, 6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంటుంది. 6కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో కూడిన మోటార్‌తో వస్తున్న బైక్ గంటలకు గరిష్టంగా 126కి.మీ దూరం ప్రయాణిస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 248కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండు సెకన్లలో 40 కి.మీ వేగం అందుకుంటుందీ మోటార్ సైకిల్. హైపర్, స్పోర్ట్స్, నార్మల్, ఎకో మోడ్స్‌లో అందుబాటులో ఉందీ బైక్. మూవ్ ఓఎస్5 వర్షన్‌తోపాటు 6.8 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్, ప్రాగ్జిమిటీ అన్‌లాక్, క్రూయిజ్ కంట్రోల్, పార్టీ మోడ్, టాంపర్ అలర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏఐ- డ్రైవెన్ కృత్రిమ్ అసిస్టెంట్, స్మార్ట్ వాచ్ అప్లికేషన్, రోడ్ ట్రిప్ ప్లానర్ ఫీచర్లు ఉంటాయి. ఫ్రంట్ అండ్ రేర్‌లో డిస్క్ బ్రేక్స్, అడ్వాన్స్డ్ సింగిల్ చానెల్ ఏబీఎస్, కార్నరింగ్ ఏబీఎస్, బ్రేక్ బై వైర్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ మోటారు సైకిల్ మూడు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు – 2.5కిలోవాట్లు, 3.5కిలోవాట్లు, 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ల్లో అందుబాటులో ఉంటుంది. 2.8సెకన్లలో 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మోటార్‌తో నడిచే బైక్ గరిష్టంగా 200 కి.మీ ప్రయాణిస్తుంది. గంటకు 124 కిమీ దూరం ప్రయాణిస్తుందీ బైక్. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్)లో ఫ్రంట్‌లో డిస్క్ బ్రేక్, యుటిలైజింగ్ బ్రేక్ బై వైర్ టెక్నాలజీ ఉంటాయి. స్పోర్ట్స్, నార్మల్, ఎకో రైడింగ్ మోడ్స్‌లో వస్తుంది. మూవ్ ఓఎస్ 5, ఓలా మ్యాప్స్ నేవిగేషన్ (టర్న్ బై టర్న్), అడ్వాన్స్డ్ రీజనరేటివ్ బ్రేకింగ్, క్రూయిజ్ కంట్రోల్, రైడింగ్ మోడ్, డీఐవై మోడ్, టీపీఎంఎస్ అలర్ట్స్, ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ ఫీచర్లు ఉంటాయి. ఓలా ఎలక్ట్రిక్ యాప్ కనెక్టివిటీతోపాటు డిజిటల్ కీ అన్‌లాక్‌కు మద్దతుగా ఉంటుంది.