న్యూఢిల్లీ, ఆగస్టు 30: రవాణ సదుపాయాలు సమకూర్చే ఓలా..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నది. ఈ ఐపీవో ద్వారా 1-1.5 బిలియన్ డాలర్లు(రూ.7324-10,985 కోట్లు) సేకరించాలనుకుంటున్నది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్స్) వద్ద వచ్చే మూడు నెలల్లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నది. పబ్లిక్ ఆఫర్‌కు సంబంధించి అవసరమైన బ్యాంకులను ఎంపిక చేయడానికి సిద్ధమైంది. ఈ వరుసలో సిటీ గ్రూపు, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లు ఉన్నాయి.