Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థ ఓల ఎలక్ట్రిక్ (Ola Electric) మార్కెట్లోకి గిగ్, ఎస్1 జడ్ శ్రేణిలో కొత్త స్కూటర్లను తీసుకొచ్చింది. గిగ్ శ్రేణిలో ఓలా గిగ్ (Ola Gig), ఓలా గిగ్+ (Ola Gig+) స్కూటర్లు ఉన్నాయి. ఓలా గిగ్ స్కూటర్ రూ.39,999 (ఎక్స్ షోరూమ్), ఓలా గిగ్ + స్కూటర్ రూ.49,999 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. ఇక ఎస్1 జడ్ శ్రేణిలో ఎస్2 జడ్, ఎస్1 జడ్+ స్కూటర్లు ఉన్నాయి. ఎస్1 జడ్ స్కూటర్ ధర రూ.59,999 (ఎక్స్ షోరూమ్), ఎస్1 జడ్+ స్కూటర్ ధర రూ.64,999 (ఎక్స్ షోరూమ్)లకు లభిస్తాయి. ఆసక్తి గల వారు రూ.499 చెల్లించి బుక్ చేసుకోవచ్చునని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి గిగ్ శ్రేణి స్కూటర్లు, మే నెల నుంచి ఎస్1 జడ్ శ్రేణి స్కూటర్ల డెలివరీ ప్రారంభం కానున్నాయి.
ఓలా గిగ్ స్కూటర్ ని గిగా వర్కర్ల కోసం ఓలా ఎలక్ట్రిక్ ఆవిష్కరించింది. తక్కువ దూరం ప్రయాణించడానికి వీలుగా ఈ స్కూటర్ డిజైన్ చేసింది. 1.5 కిలోవాట్ల రిమూవల్ బ్యాటరీతో వస్తున్న ఈ స్కూటర్.. సింగిల్ చార్జింగ్ తో 112 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. గరిష్టంగా గంటకు 25 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. బీ2బీ కొనుగోళ్లకు, రెంటల్ అవసరాలకు అందుబాటులో ఉంటుంది.
దూర ప్రయాణాలు చేసే గిగ్ వర్కర్ల కోసం ఓలా గిగ్+ తీసుకొచ్చింది ఓలా ఎలక్ట్రిక్. 1.5 కిలోవాట్ల డ్యుయల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్ తో 81 కి.మీ దూరం, రెండు బ్యాటరీలతో 157 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ కూడా బీ2బీ కొనుగోళ్ల కోసం, రెంటల్స్ కోసం అందుబాటులోకి తేనున్నది.
తక్కువ ధరకే పర్సనల్ అవసరాల కోసం డిజైన్ చేసిన స్కూటర్ ఓలా ఎస్1 జడ్. 1.5 కిలోవాట్ల డ్యుయల్ బ్యాటరీలతో వస్తున్నది. సింగిల్ బ్యాటరీతో 75 కి.మీ, రెండు బ్యాటరీలతో 146 కి.మీ దూరం ప్రయాణిస్తుందీ స్కూటర్. గరిష్టంగా గంటలకు 70 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఎల్సీడీ డిస్ ప్లే, ఫిజికల్ కీ కూడా ఉంటాయి.
పర్సనల్, వాణిజ్య వినియోగానికి రూపొందించిన స్కూటర్ ఓలా ఎస్1 జడ్+. 1.5 కిలోవాట్ల డ్యుయల్ బ్యాటరీతో వస్తున్నది. ఐడీసీ రేంజీ 75 కి.మీ దూరం, రెండు బ్యాటరీలతో 146 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. గరిష్టంగా గంటకు 70 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఫిజికల్ కీ, ఎల్సీడీ డిస్ ప్లే కూడా ఉంటాయి.
ఇంటి అవసరాల కోసం ఓలా ఎలక్ట్రిక్ ‘పవర్ పాడ్’ తెచ్చింది. దీని సాయంతో ఓలా పోర్టబుల్ బ్యాటరీని ఇన్వర్టర్లా వినియోగించుకోవచ్చు. 1.5 కిలోవాట్ల బ్యాటరీ సాయంతో 5 ఎల్ఈడీ బల్బులు, మూడు సీలింగ్ ఫ్యాన్లు, ఒక టీవీ, ఒక మొబైల్ ఫోన్, ఒక వై-ఫై రూటర్ మూడు గంటలు వాడుకోవచ్చు.. విద్యుత్ సరఫరా కొరత ఉన్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ పవర్ పాడ్ రూ.9,999లకు లభిస్తుంది.
Say hello to Ola S1 Z & Gig range, starting at just ₹39K!
Affordable, accessible, and now with a portable battery pack that doubles up as home inverter using the Ola PowerPod
Reservations open, deliveries Apr’25!🛵⚡🔋
Ola S1 Z: https://t.co/jRj8k4oKvQ
Ola Gig:… pic.twitter.com/TcdfNhSIWy— Bhavish Aggarwal (@bhash) November 26, 2024