Ola Electric Scooters | ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) దేశీయ మార్కెట్లోకి శుక్రవారం ఎనిమిది మూడో తరం ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆవిష్కరించింది. అడ్వాన్స్డ్ జెన్ 3 (Gen 3 Platform) ప్లాట్‌ఫామ్‌పై ఎస్1 (S1) బ్రాండ్‌పై ఎనిమిది స్కూటర్లను అందుబాటులకి తెచ్చింది. వీటి ధరలు రూ.79,999 (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.1,69,999 (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతాయి. జెన్ 3 ఎస్1 (Gen 3 S1) స్కూటర్లతోపాటు జెన్ 2 (Gen 2) స్కూటర్ల విక్రయాలు కొనసాగుతాయని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. శుక్రవారం (జనవరి 31, 2025) నుంచి స్కూటర్ల ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. ఫిబ్రవరి రెండో వారంలో బుక్ చేసుకున్న కస్టమర్లకు స్కూటర్ల డెలివరీ ప్రారంభం అవుతుందని వెల్లడించింది.
మూడోతరం ఎస్1 స్కూటర్లను ఆవిష్కరించిన నేపథ్యంలో ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్ (2కిలోవాట్లు, 3 కిలోవాట్లు, 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్స్) రెండోతరం స్కూటర్లపై రూ.35 వేల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది. దీంతో ఈ స్కూటర్లు రూ.1,14,999 (ఎక్స్ షోరూమ్), రూ.69,999 (ఎక్స్ షోరూమ్), రూ.79,999 (ఎక్స్ షోరూమ్), రూ.89,999 (ఎక్స్ షోరూమ్) ధరలకు లభిస్తాయి.
5.3 (4680 భారత్ సెల్) కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్నమూడోతరం ఎస్1 ప్రో + స్కూటర్ రూ.1,69,999 (ఎక్స్ షోరూమ్), 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఎస్1 ప్రో+ స్కూటర్ ధర రూ.1,54,999 (ఎక్స్ షోరూమ్) లకు లభిస్తుంది. మూడో తరం ఎస్1ప్రో స్కూటర్ (4 కిలోవాట్లు) రూ.1,34,999 (ఎక్స్ షోరూమ్), 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న స్కూటర్ రూ.1,14,999 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
ఎస్1 ఎక్స్ (2కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్) స్కూటర్ ధర రూ.79,999 (ఎక్స్ షోరూమ్), 3కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ స్కూటర్ ధర రూ.89,999 ((ఎక్స్ షోరూమ్), 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ధర రూ99,999 (ఎక్స్ షోరూమ్)లకు లభిస్తుంది. అదనంగా ఎస్1ఎక్స్ + విత్ 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ స్కూటర్ రూ.1,07,999 (ఎక్స్ షోరూమ్) లభిస్తుంది. ఈ ధరలు వచ్చే ఏడు రోజులు మాత్రమే అమల్లో ఉంటాయి. తదుపరి ఓలా ఎలక్ట్రిక్ వీటిని సవరించనున్నది.
మిడ్ డ్రైవ్ మోటార్, చైన్ డ్రైవ్, సుపీరియర్ పెర్ఫార్మెన్స్, రేంజ్, ఎఫిషియెన్సీ కోసం ఇంటిగ్రేటెడ్ ఎంసీయూతో కూడిన టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్‌తో రూపుదిద్దుకున్నాయి ఓలా మూడో తరం ఎస్1 స్కూటర్లు. ఫస్ట్ డ్యుయల్ ఏబీఎస్, బ్రేక్ బై వైర్ టెక్నాలజీ, సేఫ్టీ విస్తరణతోపాటు 15శాతం ఎనర్జీ రికవరీ మెరుగుదల కలిగి ఉంటుంది. సృజనాత్మకతతో రూపుదిద్దుకున్న మూడో తరం ఓలా ఎస్1ఎక్స్ స్కూటర్ ఇంజిన్లలో 20 శాతం విద్యుత్ పెరగడంతోపాటు 11 శాతం ఖర్చు తక్కువ. ఓలా ఎలక్ట్రిక్ తన యూజర్ల కోసం మూవ్ ఓఎస్ (Move os5) వచ్చేనెల మధ్యలో ఆవిష్కరిస్తుంది. ఇందులో ఓలా మ్యాప్స్ నిర్వహించే స్మార్ట్ వాచ్ యాప్, స్మార్ట్ పాక్, భారత్ మూడ్, రోడ్ ట్రిప్ మూడ్, లైవ్ లొకేషన్ షేరింగ్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ తదితర ఆప్షన్లు ఉంటాయి.
మోడల్ వేరియంట్ – బ్యాటరీ – రేంజ్ – మోటార్ – గరిష్ట వేగం
ఓలా ఎస్1 ఎక్స్ – 2 కిలోవాట్లు – 108 కి.మీ- 7 కిలోవాట్లు – గంటకు 101 కిమీ
ఓలా ఎస్1 ఎక్స్ – 3 కిలోవాట్లు – 176 కి.మీ- 7 కిలోవాట్లు – గంటకు 115 కిమీ
ఓలా ఎస్1 ఎక్స్ – 4 కిలోవాట్లు – 242 కి.మీ- 7 కిలోవాట్లు – గంటకు 123 కిమీ
ఓలా ఎస్1 ఎక్స్+ – 4 కిలోవాట్లు -242 కి.మీ- 11 కిలోవాట్లు – 125 కిలోవాట్లు
ఓలా ఎస్1 ప్రో – 3 కిలోవాట్లు – 176 కి.మీ -11 కిలోవాట్లు – 125 కి.మీ
ఓలా ఎస్1 ప్రో – 4 కిలోవాట్లు – 242 కి.మీ -11 కిలోవాట్లు – 125 కి.మీ
ఓలా ఎస్1 ప్రో+ – 5.3 కిలోవాట్లు – 320 కి.మీ – 13 కిలోవాట్లు – గంటకు 141 కి.మీ
ఓలా ఎస్1 ప్రో+ – 4 కిలోవాట్లు – 242 కి.మీ – 13 కిలోవాట్లు – గంటకు 141 కి.మీ
ఓలా ఎస్1ఎక్స్ – 2కిలోవాట్లు – రూ. 79,999
ఓలా ఎస్ 1ఎక్స్ – 3కిలోవాట్లు – రూ. 89,999
ఓలా ఎస్ 1ఎక్స్ – 4 కిలోవాట్లు – రూ. 99,999
ఓలా ఎస్1 ఎక్స్ + – 4కిలోవాట్లు – రూ. 1,07,999
ఓలా ఎస్ 1 ప్రో – 3 కిలోవాట్లు – రూ. 1,14,999
ఓలా ఎస్ 1 ప్రో – 4కిలోవాట్లు – రూ. 1,34,999
ఓలా ఎస్ 1 ప్రో+ – 4కిలోవాట్లు – రూ. 1,54,999
ఓలా ఎస్1 ప్రో+ – 5.3కిలోవాట్లు – రూ.1,69,999