Ola Electric- Roadster | దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric Mobiity) షేర్ శుక్రవారం 20 శాతం పుంజుకున్నది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.58,664 కోట్ల (6.99 బిలియన్ డాలర్లు) కు చేరుకున్నది. గురువారం దేశీయ మార్కెట్లో సొంత బ్యాటరీతో తక్కువ ఖర్చుతో నడిచే తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ‘ఓలా రోడ్‌స్టర్’ ఆవిష్కరించిన తర్వాత ఓలా షేర్ పుంజుకున్నది. ఓలా ఎలక్ట్రిక్ ఈ-మోటారుసైకిల్ ఆవిష్కరణతో భారత్ లోని టూ వీలర్స్ మార్కెట్ లో పోటీ పెరిగిందని భావిస్తున్నారు.
దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థలు హీరో మోటో కార్ప్, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో వంటి సంస్థల నుంచి ఓలా ఎలక్ట్రిక్ గట్టి పోటీ ఎదుర్కోనున్నది. గతేడాది 1.80 కోట్ల టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. ఐపీఓ ద్వారా ఈ నెల తొమ్మిదో తేదీన దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన ఓలా ఎలక్ట్రిక్ షేర్ లాంచింగ్ ప్రైస్ రూ.76 నుంచి 75 శాతం పెరిగింది.
గతేడాది సెప్టెంబర్‌లో పీ-ఐపీఓ అప్లికేషన్ కోసం తన 540 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ను వ్యూహాత్మకంగా 400కోట్ల డాలర్లకు కుదించేసింది. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి, గ్లోబల్ టెక్ కంపెనీల మధ్య సర్దుబాట్లను దృష్టిలో పెట్టుకున్న ఓలా తన మార్కెట్ వాల్యూయేషన్ తగ్గించుకున్నది. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద బ్యాటరీల తయారీ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో భారత్ విద్యుద్ధీకరణ థీమ్‌లో భాగస్వాములయ్యేందుకు ఇన్వెస్టర్లను ఓలా ఎలక్ట్రిక్ ఆకర్షించనున్నది.
Jeep India Discounts | ఆ రెండు కార్లపై జీప్ ఇండియా డిస్కౌంట్.. గరిష్టంగా ఎంతంటే..?!