Ola Electric E-Bike Roadster |ఎలక్ట్రిక్ ద్విచక్రాల వాహనాల తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)’ ఓ అడుగు ముందుకేసింది. ఇప్పటి వరకూ నాలుగు మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశీయ మార్కెట్లోకి తెచ్చిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric).. తాజాగా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తెచ్చింది. ఆ ఈ-మోటారు సైకిల్‌కు రోడ్‌స్టర్ (Roadster) అని పేరు పెట్టింది. దీని ధర రూ.74,999 నుంచి ప్రారంభం అవుతుంది. మూడు వేరియంట్లు – రోడ్‌స్టర్ (Roadster), రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X), రోడ్‌స్టర్ ప్రో (Roadster Pro) వేరియంట్లో లభిస్తుంది. ఒక్కో వేరియంట్ సబ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది,
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ‘సంకల్ప్ 2024’ అనే పేరుతో నిర్వహించిన వేడుకల్లో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్.. రోడ్‌స్టర్ మోటారు సైకిళ్లను ఆవిష్కరించారు. 2025 జనవరి నుంచి రోడ్‌స్టర్ (Roadster) మోటారు సైకిళ్ల డెలివరీ ప్రారంభం అవుతుందని చెప్పారు. రోడ్‌స్టర్ ప్రో (Roadster Pro, రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) వేరియంట్ మోటారు సైకిళ్లు వచ్చే ఏడాది దీపావళి నుంచి డెలివరీ ప్రారంభిస్తామని చెప్పారు.
3.5కిలోవాట్ల వేరియంట్ రోడ్‌స్టర్ (Roadster) రూ.1.04 లక్షలు, 4.5 కిలోవాట్ల వేరియంట్ రోడ్‌స్టర్ (Roadster) రూ.1.19 లక్షలు, 6 కిలోవాట్ల వేరియంట్ రోడ్‌స్టర్ (Roadster) రూ.1.39 లక్షలు పలుకుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ప్రారంభం నుంచి ఈ మోటారు సైకిళ్ల డెలివరీ ప్రారంభం అవుతుందన్నారు భవిష్ అగర్వాల్. ఇక రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపారు. 2.5 కిలోవాట్ల రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) వేరియంట్ రూ.74,000, 3.5 కిలోవాట్ల రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) వేరియంట్ రూ.85,000, 4.5 కిలోవాట్ల రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) వేరియంట్ రూ.99,000 పలుకుతుంది.