Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. వరుసగా పండుగలు రావడంతో ‘భారత్ ఈవీ ఫెస్ట్’ ప్రకటించింది. సోమవారం నుంచి ఈ ‘భారత్ ఈవీ ఫెస్ట్’ లో స్పెషల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, స్పెషల్ డిస్కౌంట్లు, బ్యాటరీపై వారంటీ పొడిగింపు తదితర ఆఫర్ల రూపంలో రూ.2,4500 వరకూ పొదుపు చేసుకునే ఛాన్స్ ఇస్తున్నది. ఫెస్ట్ టైంలో ‘ఓలా స్కూటర్’ టెస్ట్ రైడింగ్ కస్టమర్లకు కొన్ని గిఫ్ట్‌లతోపాటు ప్రతి రోజూ ఎస్1 ఎక్స్+ స్కూటర్ గెలుచుకునే చాన్స్ కల్పిస్తున్నది.
‘భారత్ ఈవీ ఫెస్ట్’లో భాగంగా ఓలా ‘ఫైవ్ ఇయర్స్ బ్యాటరీ ప్రామిస్’ ప్రోగ్రామ్ తెచ్చామని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఎస్1 ప్రో సెకండ్ జెన్ మోడల్ స్కూటర్లపై ఐదేండ్ల బ్యాటరీ వారంటీ పొడిగింపు, ఎస్1 ఎయిర్ కొంటే బ్యాటరీ వారంటీ పొడిగింపుపై 50 శాతం ధర తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. పెట్రోల్‌తో నడిచే పాత టూ-వీలర్ స్థానే కొత్త ఓలా స్కూటర్ కొనవచ్చునని పేర్కొంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.10 వేల అదనపు బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నది.
దేశంలోని ఏ ఓలా ఎక్స్పీరియన్స్ కేంద్రంలో ఓలా స్కూటర్ టెస్ట్ రైడ్ చేసి, ప్రతి రోజూ ఎస్1 ఎక్స్+ స్కూటర్ గెలుచుకునే చాన్స్ కల్పిస్తోంది. ఫ్రీ మర్చండైజ్, గిఫ్ట్‌లు, ఓలా కేర్+ డిస్కౌంట్ కూపన్లు, కొత్తగా వచ్చిన ఎస్1 ప్రో జెన్2పై ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నది. ఇక సెలెక్టెడ్ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ కింద కొనుగోలు చేసే వారికి రూ.7,500 వరకూ రాయితీ ఇస్తున్నది.
ఈ నెల 24 వరకూ ఓలా కమ్యూనిటీ సభ్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఓలా రిఫర్ చేస్తే రూ.2000 వరకూ రివార్డ్ అందుకోవచ్చు. రిఫరెన్స్ ద్వారా కొనుగోళ్లు జయప్రదంగా ముగిస్తే రిఫరెన్స్ ఇచ్చిన వారికి రూ.1000 క్యాష్ బ్యాక్ అందిస్తోంది ఓలా ఎలక్ట్రిక్. ఓలా ఎస్1 ప్రో జెన్1 ధర రూ.1.47 లక్షలు, ఎస్1 ఎయిర్ రూ.1.20 లక్షలు, ఎస్1ఎక్స్ రూ.1.10 లక్షలు, ఎస్1 ఎక్స్ (3కిలోవాట్లు) రూ. లక్ష, ఎస్1ఎక్స్ (రెండు కిలోవాట్లు) రూ.90 వేలుగా ఉంది. అన్ని మోడల్స్ ఫేమ్-2 సబ్సిడీ తర్వాత ఎక్స్ షోరూమ్ ధరలుగా ఉన్నాయి.