న్యూఢిల్లీ, మార్చి 9: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా.. మరోసారి ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ మూడోసారి ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న సందర్భంగా సంస్థ ‘చాంపియన్ మహోత్సవ్’ పేరుతో ప్రకటించిన ఆఫర్లలో భాగంగా రూ.10 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
ఓలా స్కూటర్లతోపాటు రోడ్‌స్టర్ మోటర్‌సైకిళ్లపై రూ.10 వేల ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది. ఈ ఆఫరు కేవలం మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.