న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్టీపీసీ రూ.3,248 కోట్ల విలువైన డివిడెండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఇందుకు సంబంధించి చెక్‌ను విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్‌కు ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్, కంపెనీ బోర్డు డైరెక్టర్లు అందచేశారు.
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను గతేడాది నవంబర్‌లో రూ.2,424 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించిన సంస్థ..ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి రూ.2,424 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇలా డివిడెండ్ చెల్లింపులు జరపడం ఇది 32వ సారి. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా 84 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నది.