NPCI – Bhim | దేశీయంగా డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకు పెరిగి పోతున్నాయి. డిజిటల్ పేమెంట్స్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకూ తనకు అనుబంధంగా పని చేస్తున్న యూపీఐ బేస్డ్ పేమెంట్ ఆప్ ‘భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (Bharat Interface for Money-Bhim) భీమ్ ను విడదీస్తున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది. రోజురోజుకు డిజిటల్ లావాదేవీలకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా భీమ్’ యాప్‌ను ప్రత్యేక అనుబంధ సంస్థగా ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది.
భీమ్ యాప్‌కు ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (NPCI Bhim Services Ltd)గా పేరు పెట్టింది. ఈ భీమ్ (Bhim) యాప్ నిర్వహణ కోసం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లలితా నటరాజ్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమించింది. సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా రాహుల్ హండా (Rahul Handa) వ్యవహరిస్తారు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు (IDFC First Bank)లో డిజిటల్ పార్టనర్ షిప్స్, డిజిటల్ అక్విజిషన్స్ అండ్ పేమెంట్స్ విభాగం అధిపతిగా లలితా నటరాజ్ సేవలందించారు. ఇక రాహుల్ హండా తొలుత ఓఎన్డీసీలో పని చేశారు. గత మార్చిలో భీమ్ బిజినెస్ అధిపతిగా ఎన్పీసీఐలో చేరారు. దేశీయ యూపీఐ ఎకో సిస్టమ్‌లో గూగుల్ పే, వాల్‌మార్ట్ బ్యాక్డ్ ఫోన్‌పేతోపాటు పేటీఎం సంస్థలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న వేళ.. ‘భీమ్’ యాప్ ను విడిగా ఒక సంస్థగా ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే, కేవైసీ నిబంధనలను సరిగ్గా అమలు చేయకపోవడంతో ఆంక్షలు విధించడంతో ఇటీవల పేటీఎం మార్కెట్ వాటా పడిపోయింది.
యూపీఐ పేమెంట్స్ మార్కెట్ వాటా పెంచుకోవాలన్న లక్ష్యంతోనే ఎన్పీసీఐ.. భీమ్ యాప్ ను విడదీసి ఉండొచ్చునని భావిస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)లో ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ సంస్థ మూడో ప్రధాన సంస్థ కానున్నది. భారత్ ఆవల యూపీఐ లావాదేవీల నిర్వహణకు నేషనల్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్), దేశీయంగా బిల్లు చెల్లింపుల ఎకో సిస్టమ్ కోసం నేషనల్ భారత్ బిల్ పే లిమిటెడ్ (ఎన్బీబీఎల్) సంస్థలను ఎన్‌పీసీఎల్ నిర్వహిస్తోంది.
Maruti Suzuki Ertiga | ఎంపీవీ కార్లకు గిరాకీ.. మారుతి సుజుకి ఎర్టిగా యమ పాపులర్..!
BSA Gold Star 650 | 15న భారత్ మార్కెట్లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ లాంచింగ్.. ఇవీ డీటెయిల్స్..!
Realme C63 5G | 32-ఎంపీ ఏఐ ఫీచర్లతో రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ఇవీ డీటెయిల్స్..!