Nothing Phone 2a | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ నథింట్ ఫోన్ 2ఏ.. (Nothing Phone 2a) బుధవారం న్యూ రెడ్, ఎల్లో రంగుల్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో ఆవిష్కరించారు. భారత్ లో ఆవిష్కరించడానికి బ్లూ కలర్ ఆప్షన్ తో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. నథింగ్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) అధికారిక హ్యాండిల్లో ‘సమ్ థింక్ స్పెషల్.. టుమారో’ అని పోస్ట్ చేశారు.
నథింగ్ ఫోన్ 2ఏ (Nothing Phone 2a) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.23,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.25,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.27,999లకు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా మాత్రమే ఈ ఫోన్ విక్రయాలు సాగుతాయని నథింగ్ తెలిపింది.