NDTV-Adani | తొలి రోజు ఎన్డీటీవీపై అదానీ ఓపెన్ ఆఫర్‌కు నో రెస్పాన్స్
NDTV-Adani | ఎన్డీటీవీలో 26% అదనపు వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్ చేసిన ఓపెన్ ఆఫర్‌కు తొలి రోజు మంగళవారం స్పందన కానరాలేదు.
NDTV-Adani | ఎన్డీటీవీలో అదనపు షేర్ల కొనుగోళ్లకు అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ఓపెన్ ఆఫర్‌కు తొలి రోజు స్పందన లభించలేదు. ఎన్డీటీవీ షేర్ ధర రూ.294 చొప్పున 16.7 మిలియన్ల షేర్లపై అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ఓపెన్ ఆఫర్ వచ్చేనెల ఐదో తేదీతో ముగుస్తుంది. ఎన్డీటీవీలో 26 శాతం అదనపు వాటాను సుమారు రూ.493 కోట్లకు టేకోవర్ చేసేందుకు అదానీ గ్రూప్ ఈ ఓపెన్ ఆఫర్ ప్రతిపాదించింది. వరుసగా మూడో సెషన్లో ఎన్డీటీవీ షేర్ పతనమైనా.. ఓపెన్ ఆఫర్లో షేర్ల విక్రయానికి టెండర్లు దాఖలు కాలేదని స్టాక్ ఎక్స్చేంజీ డేటా చెబుతున్నది.
బీఎస్ఈలో మంగళవారం ఎన్డీటీవీ షేర్లు రూ.376.25 వద్ద ముగిశాయి. సోమవారం ముగింపుతో పోలిస్తే 1.56 శాతం పతనం అయ్యాయి. గత గురువారం నుంచి బీఎస్ఈలో ఎన్డీటీవీ స్టాక్ 11.17 శాతం పడిపోయింది. మంగళవారం ముగింపు విలువతో పోలిస్తే ఓపెన్ ఆఫర్ సుమారు 28 శాతం ఎక్కువే.
`తొలి రోజు ఓపెన్ ఆఫర్‌కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపలేదు. అదానీ గ్రూప్ తన ఓపెన్ ఆఫర్ ధర సవరించనూ లేదు. ఎన్డీటీవీ ప్రమోటర్లు కౌంటర్ ఆఫర్ చేయలేదు` అని ఇన్‌గవర్న్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామ్ సుబ్రమణియన్ చెప్పారు. ఇప్పటికైతే ఎన్డీటీవీ టేకోవర్ విషయమై స్టేటస్కో నడుస్తున్నది. ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికారాయ్ నేరుగా సంస్థలో 32.26 శాతం వాటా కలిగి ఉన్నారు. అదానీ గ్రూప్‌కు 29.18 శాతం వాటా ఉంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు 14.72 శాతం షేర్లు, వ్యక్తులూ ఇతర సంస్థలు కలిసి 23.84 శాతం కలిగి ఉన్నారు.
ఓపెన్ ఆఫర్‌కు జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలని వాటాదారులను ఎన్డీటీవీ ఇండిపెండెంట్ డైరెక్టర్లు కోరారు. షేర్ ట్రేడింగ్ విలువ కంటే ఓపెన్ ఆఫర్ ధర ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. సెబీ ఎస్‌ఏఎస్‌టీ నిబంధనల ప్రకారం ఓపెన్ ఆఫర్ ఫెయిర్‌గా, ఆమోదయోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు. గణనీయ స్థాయిలో ఓపెన్ ఆఫర్ ధర ఎక్కువగా ఉన్న స్టాక్ మార్కెట్లలో ఎన్డీటీవీ షేర్ లక్ష్యంగా ట్రేడింగ్ చేయడంపై ఇండిపెండెంట్ డైరెక్టర్ల కమిటీ దృష్టి సారించింది.
గతంలో ఎన్డీటీవీ ప్రమోటర్స్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్‌కు రుణం ఇచ్చిన విశ్వప్రధాన్ కమర్షియల్ లిమిటెడ్ (వీసీపీఎల్)లో 99.99 శాతం వాటాను అదానీ గ్రూప్ గత ఆగస్టులో టేకోవర్ చేసింది. ఆర్ఆర్పీఆర్తో కుదిరిన ఒప్పందం ప్రకారం వీసీపీఎల్ తన రుణాన్ని ఏ క్షణంలోనైనా 29.18 శాతం వాటాగా మార్చుకునే హక్కు కలిగి ఉంటుంది. దీని ఆధారంగానే వీసీపీఎల్ రుణం కింద ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను అదానీ గ్రూప్ టేకోవర్ చేసింది. తాజాగా ఎన్డీటీవీలో యాజమాన్య హక్కుల కోసం అదనంగా 26 శాతానికి అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

