Nirmala Sitharaman | పాత ఆదాయం పన్ను విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత ఆదాయం పన్నువిధానాన్ని (Old Income tax Regime) రద్దు చేసేందుకు తమ ప్రభుత్వానికి ఎటువంటి ప్రణాళికల్లేవని తేల్చి చెప్పారు. ఇండియాటుడే ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సంగతి తెలిపారు. ఆదాయం పన్ను చెల్లింపుల విధానాన్ని సరళతరం చేయాలని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. నిబంధనల భారం తగ్గించాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
1961లో రూపొందించిన పాత ఆదాయం పన్ను చట్టం (Old Income Tax Act) స్థానంలో సమగ్ర నూతన ఆదాయం పన్ను బిల్లును (New Income Tax Bill) పార్లమెంట్లో ప్రవేశ పెడతామని నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు. పాత ఆదాయం పన్ను చట్టాని( Old Income Tax Act) కి చాలా అంశాలు జోడించి కొత్త చట్టం తీసుకొస్తామన్నారు. త్వరలో ఆ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. చాలా మంది ప్రజలు పాత ఆదాయం పన్ను విధానం (Old Income tax Regime) ద్వారా మినహాయింపులు కోరుకున్నంత కాలం దాన్ని రద్దు చేసే ప్రణాళికలు లేవన్నారు.
ఈ నెల ఒకటో తేదీన వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదిస్తూ నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman).. మధ్య తరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాం. వ్యక్తిగత ఆదాయం పన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నాం. టీడీఎస్ లేదా టీసీఎస్‌లో ఇబ్బందులను తగ్గించి హేతుబద్ధీకరిస్తాం. స్వచ్ఛందంగా నిబంధనల అమలుకు ముందు వచ్చేలా, నియంత్రణ నిబంధనల భారం తగ్గిస్తూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయిమెంట్‌ను ప్రోత్సహించేలా ఆదాయం పన్ను విధానంలో సంస్కరణలు ఉంటాయని చెప్పారు.