IPO`S | హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ‘నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్’, ‘పరాస్ హెల్త్ కేర్’ సంస్థల ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది. పరాస్ హెల్త్ బ్రాండ్ కింద హాస్పిటల్స్ నెట్ వర్క్ నిర్వహిస్తుందీ సంస్థ. తాజా ఈక్విటీ షేర్ల విడుదల, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.3000 కోట్ల నిధుల సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్. ఇక పరాస్ హెల్త్ కేర్ సంస్థ రూ.400 కోట్ల నిధులను సేకరించనున్నది. గత జూలై, ఆగస్టు నెలల్లో తమ ఐపీఓలకు అనుమతి ఇవ్వాలని నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్, పరాస్ హెల్త్ సంస్థల యాజమాన్యాలు సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి. ప్రతిపాదిత ఐపీఓ ప్రకారం నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.800 కోట్ల విలువైన ప్రమోటర్ షేర్లు, రూ.2200 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) షేర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. పరాజ్ హెల్త్ కేర్ ఐపీఓ ద్వారా తాజాగా రూ.400 కోట్ల విలువైన కొత్త షేర్ల విడుదల, ఓఎఫ్ఎస్ ద్వారా నిధులు సేకరించాలని నిర్ణయించుకున్నది. పరాస్ హెల్త్ కర్ హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ ప్రాంతాల్లో సేవలందిస్తున్నది.