న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ‘రీఅస్యూర్ 2.0’ పేరుతో ఓ సరికొత్త ఆరోగ్య బీమా పథకాన్ని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రారంభించింది. పాలసీదారుడు తన తొలి క్లెయిం చేసేదాకా ఈ ప్లాన్లో వారి ప్రవేశ వయసు లాకిన్లోనే ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలోనే హెల్త్ పాయింట్స్ ఆధారంగా ప్రీమియంలపై 30 శాతం వరకు తగ్గింపును కూడా పొందవచ్చన్నది.
రూమ్ అద్దెలపై ఎటువంటి పరిమితి ఉండబోదని, దవాఖానలో కేవలం 2 గంటలే ఉన్నా బీమా కవరేజీ ఉంటుందని, డయాబెటిస్-హైబీపీ రోగులకు పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 18 ఏండ్ల నుంచి 65 ఏండ్ల వారికి పాలసీలు అందుబాటులో ఉంటాయని, కవరేజీ కనిష్ఠంగా రూ.5 లక్షలు, గరిష్ఠంగా కోటి రూపాయలుగా ఉందన్నాయి.