Nissan 3SUVs | ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్స్.. భారత్ మార్కెట్లో మూడు ఇంటర్నేషనల్ ఎస్యూవీ క్యాటగిరీ కార్లు జూక్, క్వాష్ఖాయి, ఎక్స్- ట్రయల్‌లను ఆవిష్కరించింది. ఇప్పటికే దేశీయ రోడ్లపై క్వాష్ఖాయి, ఎక్స్ – ట్రయల్ వంటి కార్ల టెస్ట్ డ్రైవింగ్ సాగుతున్నది. భారత మార్కెట్లోకి తొలుత ఎక్స్-ట్రయల్ రానుండగా, జూక్ అడుగు పెట్టింది. ఇంతకుముందు జూక్ ఎస్యూవీ వేరయింట్ కారు.. చైనాతోపాటు కొన్ని దేశాల మార్కెట్లో ఆవిష్కరించారు.
చెన్నైలోని మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ వద్ద ఈ మూడు ఎస్యూవీ మోడల్ కార్ల టెస్టింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. కొన్ని వారాలు టెస్టింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత దేశీయ మార్కెట్ – రోడ్లకు అనుగుణంగా గ్లోబల్ మోడల్ కార్లలో మార్పులు తీసుకొస్తామని నిస్సాన్ ప్రకటించింది. ఎక్స్ – ట్రయల్ కారును త్వరలో భారత్ మార్కెట్లోకి తెస్తారు. జూక్, క్వాష్ఖాయిలతోపాటు ఎక్స్ – ట్రయల్ కార్ల టెస్టింగ్ కొనసాగుతుంది. అటుపై జూక్, క్వాష్ఖాయి వేరియంట్లను భారత మార్కెట్లో ఆవిష్కరిస్తామని నిస్సాన్ మోటార్స్ ఇండియా తెలిపింది.
నిస్సాన్ ఇండియా అద్యక్షుడు ఫ్రాంక్ టొర్రెస్ మాట్లాడుతూ.. భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బెస్ట్ మోడల్ కారును దేశీయ మార్కెట్లో ఆవిష్కరిస్తాం అని అన్నారు. భారత్ మార్కెట్లో నిస్సాన్ మాగ్నిఫిసెంట్ విజయవంతంగా అమ్ముడైన తర్వాత తాము టాప్- క్లాస్ ఎస్యూవీ కారు ఆవిష్కరించాలని చూస్తున్నాం అని చెప్పారు. భారత్ మార్కెట్లో తమ స్థానాన్ని కాపాడుకునేందుకు భవిష్యత్ ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు. కార్ల మార్కెట్‌కు భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు.
నిస్సాన్ ఎక్స్ – ట్రయల్ 1.5 లీటర్ల సామర్థ్యం గల టర్బో పెట్రోల్ ఇంజిన్‌లో రెగ్యులర్ ఐసీఈతోపాటు ఈ-పవర్డ్ హైబ్రీడ్ గిడ్డీస్లు ఉంటాయి. ఇది 161 బీహెచ్పీ, 300ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సీవీటీ గేర్‌బాక్స్‌తో ఈ కారు వస్తున్నది. ఈ-పవర్ ఎక్స్- ట్రయల్ సింగిల్ మోటార్ (ఎఫ్‌డబ్ల్యూడీ), టూ – మోటార్ (ఏడబ్ల్యూడీ) గజ్లింగ్స్తో వస్తుంది.
క్వాష్ఖాయి కారులో 1.3 లీటర్ల సామర్థ్యం గల ఈ-పవర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 1..3 లీటర్ల కంబుస్టన్తో రూపుదిద్దికున్నది. ఇది 187బీహెచ్పీ, 330 ఎన్ ఎం టార్చి వెలువరిస్తుంది. 1.3- లీటర్ల కంబుస్టన్ ఇంజిన్‌ను బ్యాటరీ ప్యాక్- అప్‌తో చార్జింగ్ చేయొచ్చు. నిస్సాన్ మోటార్స్ ఇండియా.. దేశీయ మార్కెట్లో హైబ్రీడ్ వర్షన్ కారును ఆవిష్కరించింది. ఇది 1.6- లీటర్ల పెట్రోల్ ఇంజిన్, స్ట్రాంగ్ హైబ్రీడ్ సిస్టమ్తోపాటు ఎలక్ట్రిక్ మోటార్‌తో రూపుదిద్దుకున్నదీ కారు.