Nissan X-Trail | భారత్ మార్కెట్లోకి నిసాన్ ఎక్స్-ట్రయల్.. ధరెంతంటే..?!
Nissan X-Trail | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిసాన్ మోటార్ ఇండియా (Nissan Motor India) దేశీయ మార్కెట్లో తన ఎక్స్-ట్రయల్ (X-Trail) కారును ఆవిష్కరించింది.
Nissan X-Trail | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిసాన్ మోటార్ ఇండియా (Nissan Motor India) దేశీయ మార్కెట్లో తన ఎక్స్-ట్రయల్ (X-Trail) కారును ఆవిష్కరించింది. కంప్లీట్లీ బిల్డ్ అప్ (సీబీయూ) మోడల్లో భారత్ మార్కెట్లోకి వస్తున్న నిసాన్ ఎక్స్-ట్రయల్ (Nissan X-Trail) ధర రూ.49.92 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. టయోటా ఫార్చూనర్ (Toyota Fortuner), ఎంజీ గ్లోస్టర్ (MG Gloster), జీప్ మెరిడియన్ (Jeep Meridian), స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది నిసాన్ ఎక్స్-ట్రయల్. గ్లోబల్ మార్కెట్లలో నిసాన్ ఎక్స్-ట్రయల్ (Nissan X-Trail) కారు 150కి పైగా దేశాల్లో లభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 78 లక్షల యూనిట్ల కార్లు విక్రయించిన నిసాన్ ఎక్స్-ట్రయల్.. 2023 గ్లోబల్ ఎస్యూవీ టాప్-5 కార్లలో ఒకటిగా నిలిచింది.
ప్రపంచంలోనే వారియబుల్ కంప్రెషన్ ఇంజిన్‌తో వస్తున్న తొలి కారు నిసాన్ ఎక్స్-ట్రయల్. 1.5 లీటర్ల 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 163 పీఎస్ విద్యుత్, 300 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. డీ-స్టెప్ లాజిక్ కంట్రోల్, పెడల్ షిఫ్టర్స్ తోపాటు థర్డ్ జనరేషన్ ఎక్స్‌ట్రానిక్ సీవీటీతో వస్తున్నదీ కారు. ఫ్యుయల్ మైలేజీ కోసం 12వీ ఏఎల్ఐఎస్ (అడ్వాన్స్డ్ లిథియం అయాన్ బ్యాటరీ సిస్టమ్) మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ జత చేశారు.
రెనాల్ట్-నిసాన్ అలయెన్స్ ఆధారంగా సీఎంఎఫ్-సీ ప్లాట్ ఫామ్ పై రూపుదిద్దుకున్న నిసాన్ ఎక్స్-ట్రయల్ కారు భారత్ మార్కెట్లోకి 7-సీటర్ అవతార్‌లో వస్తోంది. ఫ్లోటింగ్ రూఫ్, వీ-మోషన్ గ్రిల్లె, ఎల్ఈడీ యూనిట్లతో కూడిన హెడ్ లైట్స్, డీఆర్ఎల్స్, రేర్ లో స్ప్లిట్ టైల్స్ ఉంటాయి. 20-అంగుళాల మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ వస్తున్న ఈ కారు మూడు ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లు – పెరల్ వైట్, డైమండ్ బ్లాక్, చాంపేన్ సిల్వర్ రంగుల్లో వస్తోంది.
నిసాన్ ఎక్స్-ట్రయల్ (Nissan X-Trail) 8- అంగుళాల నిసాన్ కనెక్ట్ డిస్ ప్లే స్క్రీన్ కంపాటిబుల్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే (వైర్ లెస్), 12.3 అంగుళాల టీఎఫ్ టీ మల్టీ ఇన్ఫర్మేషన్ స్క్రీన్, డ్యుయల్ జోన్ ఆటోమేటిక్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, వైర్ లెస్ చార్జర్, సెవెన్ ఎయిర్ బ్యాగ్స్, పనోరమిక్ సన్ రూఫ్, 360-డిగ్రీ కెమెరా వ్యూ తదితర ఫీచర్లు కలిగి ఉంటుంది. భారత్ మార్కెట్లో మూడేండ్లు లేదా లక్ష కి.మీ వారంటీ, అదనంగా మూడేండ్ల ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్, రెండేండ్ల నుంచి మూడేండ్ల వరకూ ప్రీ-పెయిడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

