Nissan Magnite | ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిసాన్ తన మ్యాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ కారును అక్టోబర్ నాలుగో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. నాలుగేండ్ల క్రితం నిసాన్ మ్యాగ్నైట్ కారును తొలిసారి భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తాజాగా పలు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అప్డేట్లతోపాటు పవర్ ట్రైన్ ఆప్షన్లతో నిసాన్ మ్యాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ వస్తున్నది.
నిసాన్ మ్యాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లు – బీ4డీ 1.0 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (72 పీఎస్ విద్యుత్, 96 ఎన్ఎం టార్క్), హెచ్ఆర్ఏఓ 1.0 లీటర్ల టర్బో పెట్రోల్ (100 పీఎస్ విద్యుత్, 160/152 ఎన్ఎం టార్క్) ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. బీ4డీ 1.0 లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ అండ్ 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, హెచ్ఆర్ఏఓ 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, సీవీటీ ఆప్షన్లలో లభిస్తుంది.
సిట్రోన్ బసాల్ట్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, రెనాల్ట్ కైగర్, హ్యుండాయ్ ఎక్స్టర్, టాటా పంచ్ తదితర కార్లకు నిసాన్ మ్యాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. నిసాన్ మ్యాగ్నైట్ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.11.11 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. కొత్త నిసాన్ మ్యాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ కారు ధర రూ.6.50 లక్షల నుంచి రూ.11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుందని భావిస్తున్నారు.