Nissan Magnite EZ Shift | నిసాన్ ఇండియా మోటార్స్ తన పాపులర్ సబ్-4 మీటర్ ఎస్యూవీ మోడల్ మాగ్నైట్ ఏఎంటీ ఎడిషన్ ఈజడ్ షిఫ్ట్’ను మార్కెట్లో ఆవిష్కరించింది. మాగ్నైట్ ఈజడ్ షిఫ్ట్ నాలుగు వేరియంట్లు -ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్‌వీ, ఎక్స్ వీ ప్రీమియం, ఎక్స్‌వీ కురో ఎడిషన్లలో లభిస్తుంది. ఈ నాలుగు వేరియంట్ కార్లు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) ఆప్షన్‌తోనే అందుబాటులో ఉంటాయి.
భారత్ మార్కెట్లో టాటా పంచ్, హ్యుండాయ్ ఎక్స్టర్ కార్లతో నిసాన్ ఇండియా మోటార్స్ ఏఎంటీ ఎడిషన్ ‘ఈజడ్-షిఫ్ట్’ పోటీ పడుతుంది. టాటా పంచ్ ఏఎంటీ మోడల్ కారు ధర రూ.7.5 లక్షలు (ఎక్స్ షోరూమ్), హ్యుండాయ్ ఎక్స్టర్ ఏఎంటీ రూ.8.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. నిసాన్ ఇండియా మోటార్స్ ‘ఈజడ్-షిఫ్ట్’ కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల వారు రూ.11 వేలు టోకెన్ సొమ్ము చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు.
నిసాన్ మ్యాగ్నైట్ ఈజడ్-షిప్ట్ 1.0 లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 71 బీహెచ్పీ విద్యుత్, 96 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ట్యూన్ చేశారు. కారులో ఆటోమేటిక్, మాన్యువల్ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. హిల్ స్టార్ట్ అసిస్ట్ తోపాటు వెహికల్ డైనమిక్ కంట్రోల్ అన్ని వేరియంట్లలో ఉంటుంది. ఈజడ్ షిఫ్ట్ ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజీ 19.70 కి.మీ కాగా, మాన్యువల్ ఎడిషన్ 19.35 కి.మీ మైలేజీ ఇస్తుంది.
మ్యాగ్నైట్ ఈజడ్-షిఫ్ట్ రెగ్యులర్ ఎడిషన్ కారు ఎక్స్టీరియర్ డిజైన్‌లో కొత్తగా బ్లూ డ్యుయల్ టోన్ కలర్ విత్ బ్లాక్ రూఫ్ ప్రవేశపెట్టింది. షార్ప్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ జత చేశారు. ఇంటీరియర్‌గా 8-అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆటో ఏసీ విత్ రేర్ వెంట్స్, పుష్ బటన్ స్టార్ట్ – స్టాప్, వ్యూ మానిటర్, స్మార్ట్ కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్ లెస్ చార్జింగ్, ఎయిర్ ఫ్యూరిఫయర్, అంబియెంట్ మూడ్ లైటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
సేఫ్టీ కోసం డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్), స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, హిల్ స్టార్ట్ అసిస్ట్ (హెచ్ఎస్ఏ), హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ (హెచ్‌బీఏ), 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్, ఈబీడీ తదితర ఫీచర్లు ఉంటాయి.