EaseMyTrip | విమానం, రైలు, బస్సు ప్రయాణాల కోసం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేందుకు తీసుకొచ్చిన ఈజీ మై ట్రిప్ అనే సంస్థ కో-ఫౌండర్ నిషాంత్ పిట్టి.. కంపెనీ సీఈఓగా వైదొలిగారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన వైదొలిగారని, ఈ నిర్ణయం జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో ఈజీ మై ట్రిప్ తెలిపింది. ప్రస్తుతం సంస్థ సీఎఫ్ఓగా ఉన్న మరో కో-పౌండర్ నిషాంత్ పిట్టి సోదరుడు రికాంత్ పిట్టిని తక్షణం సీఈఓగా నియమిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ సీఈఓగా రికాంత్ పిట్టే.. సంస్థ స్టాటర్జిక్ ఇన్షియేటివ్స్, డ్రైవ్ ఇన్నోవేషన్, కస్టమర్ ఎక్స్ పీరియన్స్ పెంచుతూ ఈజీ మై ట్రిప్ స్థానాన్ని బలోపేతం చేస్తారని ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది.
ఇంతకు ముందు నిషాంత్ పిట్టి.. సంస్థలో తన వాటాను విక్రయిస్తున్నట్లు వార్తలొచ్చాయి. 2024 డిసెంబర్ 31న సంస్థలోని ఆయన షేర్లు బ్లాక్ ట్రేడ్ ద్వారా రూ.78,32 కోట్లకు విక్రయించారు. 4.99 కోట్ల షేర్లు (1.41 శాతం వాటా) అప్ లోడ్ చేశారు. ఈజీ మై ట్రిప్ బ్రాండ్ మాతృసంస్థ ఈజీ ట్రిప్ ప్లానర్. తాజా నిర్ణయంతో కంపెనీలో పిట్టి యాజమాన్యం వాటా 12.8 శాతానికి, కంబైన్డ్ ప్రమోటర్ వాటా 50.38 నుంచి 48.97 శాతానికి పడిపోయింది. గత సెప్టెంబర్ నెలలో కంపెనీలో 14 శాతం వాటాను రూ.920 కోట్లకు విక్రయించారు.