Income Tax | ఇటీవలి బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా మార్చిన విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఈ నెల 1న పార్లమెంట్లో ప్రకటించిన పద్దులో ఏకంగా రూ.12 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులు ఉండబోవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మునుపు ఇది రూ.7 లక్షలుగానే ఉన్నది. ఇక స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలతో కలిపితే ఈ పన్ను మినహాయింపు ప్రయోజనం రూ. 12.75 లక్షలకు చేరుతున్నది. అయితే బడ్జెట్‌కు ముందున్న కొత్త పన్ను విధానంతో పోల్చితే ఇప్పుడు రూ.5 లక్షలకుపైగా పన్ను మినహాయింపు ప్రయోజనం పెరిగినా.. ఇంకా పాత పన్ను విధానంలోనే ట్యాక్స్‌పేయర్స్‌కు అధిక లాభాలు కనిపిస్తుండటం గమనార్హం. రూ.15 లక్షలు వార్షిక వేతనం ఉన్నవారు.. గరిష్ఠ పన్ను మినహాయింపులను కనుక ఉపయోగించుకున్నైట్టెతే కొత్త పన్ను విధానం కింద చెల్లించాల్సి వచ్చే పన్నుల్లో సగం చెల్లిస్తే సరిపోతున్నది మరి. 48వేల రూపాయలకుపైగా ప్రయోజనం చేకూరుతున్నది.
ఇదీ సంగతి..
దేశంలోని వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులందర్నీ కొత్త ఆదాయ పన్ను పరిధిలోకి తేవాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు ముందుకెళ్తున్నది. అందుకే ఐదేండ్లుగా ప్రతీ బడ్జెట్లో ఈ కొత్త ఆదాయ పన్ను విధానంలోనే రకరకాల సవరణలు, మినహాయింపులు, ప్రయోజనాలను కల్పిస్తూ వస్తున్నది. 2020లో కొత్త ఆదాయ పన్ను విధానాన్ని తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి పాత ఆదాయ పన్ను విధానం జోలికే వెళ్లడం లేదు. అయినప్పటికీ ట్యాక్స్‌పేయర్స్‌కు ఇంకా పాత ఆదాయ పన్ను విధానమే ఉత్తమంగా నిలుస్తుండటం గమనార్హం. అయితే పొదుపు, పెట్టుబడులు, పెద్దగా ఖర్చులు లేని ఉద్యోగులు.. కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకోవడమే లాభదాయకం అని చెప్పవచ్చు. కానీ ఏటా పీపీఎఫ్, ఈపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్, గృహ రుణం, బీమా ప్రీమియంలు, గృహ రుణ అలవెన్స్ (హెచ్ఆర్ఏ), పిల్లల విద్య కోసం చేసే ఖర్చులు వంటివి క్లెయిం చేసుకునే వీలున్నవారు మాత్రం పాత ఆదాయ పన్ను విధానాన్ని అనుసరించడమే ఇప్పటికీ లాభదాయకమని చెప్పవచ్చు.
గుర్తుంచుకోండి
పాత పన్నులో గరిష్ఠ మినహాయింపులివీ
కొత్త పన్ను విధానంలో గరిష్ఠ మినహాయింపులివీ