న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ కవాసకి తన వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. నింజా జెడ్ఎక్స్-10ఆర్ మాడల్‌ను రూ.30 వేల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ వచ్చే నెల చివరి వరకు లేదా స్టాక్స్ ఉన్నవరకు ఉండనున్నదని పేర్కొంది.
దీంతో నింజా జెడ్ఎక్స్-10ఆర్ మాడల్ ధర రూ.18.50 లక్షలకు లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ బైకును కొనుగోలు చేసిన వారికి రూ.30 వేల వరకు ఈఎంఐ క్యాష్‌బ్యాక్ లభించనున్నది.