US Fed Reserve | గతవారం ట్రేడింగ్‌లో ఐటీసీ మినహా టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థలు రూ.1,87,808.26 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయాయి. మార్కెట్ లీడర్ రిలయన్స్తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) స్క్రిప్ట్‌లు కూడా పతనం అయ్యాయి. పెరిగిన అధిక ధరలను కట్టడి చేయడానికి యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచుతుందన్న ఆందోళనలు మార్కెట్లను వెంటాడాయి. విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు విక్రయించడం కూడా ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీనపడటానికి దారి తీసింది. దీంతో గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1538.64 పాయింట్లు (2.52%) నష్ట పోయింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.37,848.16 కోట్లు నష్టపోయి రూ.8,86,070.99 కోట్ల వద్ద సరిపెట్టుకున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.36,567.46 కోట్ల పతనంతో రూ.16,14,109.66 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీ దిగ్గజం టీసీఎస్ ఎం-క్యాప్ రూ.36,444.15 కోట్లు కోల్పోయి, రూ.12,44,095.76 కోట్ల వద్ద నిలిచింది. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,871.15 కోట్ల నష్టంతో రూ.4,71,365.94 కోట్లకు పరిమితమైంది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,765.56 కోట్లు నష్టపోయి రూ.5,86,154.58 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.13,465.86 కోట్లు పతనమై రూ.6,52,862.70 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,729.2 కోట్ల నష్టంతో రూ.4,22,034.05 కోట్ల వద్ద ముగిసింది. భారతీయ స్టేట్ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.8,879.98 కోట్లు కోల్పోయి రూ.4,64,927.66 కోట్ల వద్ద నిలిచింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) రూ.7,236.74 కోట్లు పతనమై రూ.5,83,697.21 కోట్ల వద్దకు చేరుకున్నది.
ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,143.73 కోట్లు పెరిగి రూ.4,77,910.85 కోట్లకు పెరిగింది. ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ టాప్‌లో కొనసాగుతుండగా, తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, భారతీయ స్టేట్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.