హైదరాబాద్, అక్టోబర్ 11: ఐఐటీ-హైదరాబాద్‌తో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్-కుండ్లి(నిఫ్టెమ్-కే) ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఆహార సాంకేతిక, డిజిటల్ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పందం దోహదం చేయనున్నది.
ఫుడ్ టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్, రీసర్చ్, విద్యార్థులకు నూతన అవకాశాల మధ్య పెరిగిన అంతరాన్ని తగ్గించడానికి ఈ ఒప్పందం కీలకంగా మారనున్నదని నిఫ్టెమ్-కే డైరెక్టర్ హరిందర్ సింగ్ ఓబేరాయ్ తెలిపారు. ఇటీవల ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.