Maruti New Swift | మారుతి సుజుకి పేరెంట్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్.. ఫోర్త్ జనరేషన్ మోడల్ కారు ‘స్విఫ్ట్’ను ఆవిష్కరించింది. టోక్యోలో జరుగుతున్న ఆటోమోటార్ షో-2023లో దీన్ని ఆవిష్కరించారు. పాత తరం స్విఫ్ట్ మోడల్ కారులో కొన్ని మార్పులు చేసి ఆవిష్కరించారు. భారత్ మార్కెట్లో నూతన తరం ‘స్విఫ్ట్’ మోడల్ కారు.. ‘సీఎన్జీ’, ‘హైబ్రీడ్’ ఇంజిన్ ఆప్షన్లలో ఆవిష్కరిస్తారు. ఈ కారులో అడాస్ వంటి సేఫ్టీ ఫీచర్లు జత చేస్తారు. వచ్చే ఏడాది మధ్యలో భారత్ మార్కెట్లోకి న్యూ జనరేషన్ ‘మారుతి స్విఫ్ట్’ రానున్నదని తెలుస్తున్నది.
ఫ్రంట్‌లో హెడ్ ల్యాంప్స్ విత్ ప్రొజెక్టర్, ఇన్ బిల్ట్ ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్, రీ డిజైన్డ్ బ్లాక్ గ్రిల్లె విత్ హానీ కాంబ్, డార్క్ క్రోమ్ ఫినిష్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఫ్రంట్ బంపర్, ఫ్రంట్ ఫాగ్ లాంప్. ఇంతకుముందు కంటే చిన్నగా, స్పోర్టియర్‌గా రేర్ టెయిల్ లైట్స్ ఉంటాయి. టెయిల్ గేట్‌పై హైబ్రీడ్ బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది.
ఫోర్డ్ ఫిగో, మారుతి బాలెనో, బ్రెజా మోడల్ కార్లలో మాదిరిగా న్యూ జనరేషన్ ‘స్విఫ్ట్’లో ఆల్ న్యూ డాష్ బోర్డ్ లేఔట్ విత్ బ్లాక్ అండ్ వైట్ డ్యుయల్ టోన్ థీమ్ ఉంటాయి. 9.0 అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్లీక్ ఏసీ వెంట్స్, హెచ్ వీఏసీ కంట్రోల్, వైర్ లైస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి.
న్యూ స్విఫ్ట్ మోడల్ కారులో 360-డిగ్రీ కెమెరా, డ్యుయల్ సెన్సర్ బ్రేక్ సపోర్ట్, అడాప్టివ్ హై బీం అసిస్ట్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, కొల్లిషన్ మిటిగేసన్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ‘అడాస్’ ఫీచర్లు, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, 6- ఎయిర్ బ్యాగ్స్ తదితర ఫీచర్లు ఉంటాయి.
ఇంటర్నేషనల్ స్పెషిఫికేషన్ స్విఫ్ట్.. హైబ్రీడ్ అండ్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తోపాటు ‘మల్టీపుల్ పవర్ ట్రైన్ ఆప్షన్లతో వస్తుందని భావిస్తున్నారు. భారత్ మార్కెట్లో ఆవిష్కరించే న్యూ స్విఫ్ట్ కారు 1.2 లీటర్ల 4-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 88.5 బీహెచ్పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుందని చెబుతున్నారు. 5-స్పీడ్ మాన్యువల్ అండ్ ఏఎంటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు ఉంటాయి.
న్యూ ‘స్విఫ్ట్’ కారు వచ్చే ఏడాది ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్లో సుజుకి ఆవిష్కరిస్తుంది. వచ్చే ఏడాది రెండో అర్థభాగంలో భారత్ మార్కెట్లోకి వస్తుంది. ప్రస్తుతం స్విఫ్ట్ కారు ధర రూ.5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. న్యూ ఫీచర్లు, డిజైన్‌తో న్యూ స్విఫ్ట్ కారు రూ.6.3 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.