Tata Motors Discounts | మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా సంస్థలతో పోటీ పడుతున్న కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. తన కార్ల విక్రయాలను పెంచుకునేందుకు వివిధ మోడల్ కార్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ కార్లతోపాటు ఇంటర్నల్ కంబుష్టన్ ఇంజిన్ (ఐసీఈ) మోడల్ కార్లపైనా ఈ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. గరిష్టంగా రూ.1.35 లక్షల వరకూ రాయితీ కల్పిస్తోంది. ఈ డిస్కౌంట్లు ఈ నెలాఖరు వరకూ అమల్లో ఉంటాయి.
టాటా మోటార్స్ పాపులర్ మోడల్ కార్లు – టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్, టాటా నెక్సాన్, టాటా సఫారీ, టాటా హారియర్ వంటి కార్లలో వేరియంట్లను బట్టి గరిష్టంగా రూ.55 వేల వరకూ డిస్కౌంట్లు లభిస్తాయి. ఇక ఎలక్ట్రిక్ కార్లలో టాటా టియాగో ఈవీ, టాటా టైగోర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ కార్లపై గరిష్టంగా రూ.1.35 లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్లలో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్చ్సేంజ్ డిస్కౌంట్, స్క్రాపేజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.
టాటా మోటార్స్ కార్లలో టాటా టియాగో అత్యంత చౌక కారు. ఈ కారు పెట్రోల్, పెట్రోల్-సీఎన్జీ, ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ టెక్నాలజీ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ టియాగోపై గరిష్టంగా రూ.60 వేల డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఇందులో క్యాష్ బెనిఫిట్ రూ.35 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలు, రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ టియాగోపై రూ.25 వేల క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,000లతో కలిపి గరిష్టంగా రూ.50 వేల డిస్కౌంట్ లభిస్తుంది.
కంపాక్ట్ సెడాన్ కారు టాటా టైగోర్ పెట్రోల్ వేరియంట్ మీద గరిష్టంగా రూ.55 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.30 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5000 లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ మీద రూ.25 వేల క్యాష్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5000తో కలుపుకుని రూ.50 వేల రాయితీ లభిస్తుంది.
టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్ మీద గరిష్టంగా రూ.50 వేల ధర తగ్గింపు లభిస్తుంది. అందులో క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5000 లభిస్తుంది. ఇక ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్ మీద రూ.40 వేల వరకూ రాయితీ అందుకోవచ్చు.
టాటా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్ కంపాక్ట్ ఎస్యూవీ కారు నెక్సాన్ మీద రూ.50 వేల వరకూ రాయితీ అందుబాటులో ఉంది. అందులో రూ.25 వేలు క్యాష్ బెనిఫిట్, రూ.20 వేలు స్క్రాపేజ్ లేదా ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5000 లభిస్తుంది. టాటా హారియర్, టాటా సఫారీలపై గరిష్టంగా రూ.30 వేల డిస్కౌంట్ ఆఫర్ చేసింది టాటా మోటార్స్.
టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ మోడల్ నెక్సాన్ ఈవీపై రూ.1.35 లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. సెలెక్టెడ్ వేరియంట్లపై రూ.85 వేల వరకూ రాయిత పొందొచ్చు. అత్యంత చౌక ధరకు లభించే టాటా టైగోర్ ఈవీపై రూ.95 వేల డిస్కౌంట్ ప్రకటించింది టాటా మోటార్స్. ఇందులో లాంగ్ రేంజ్ ట్రిమ్ రూ.75 వేలు, మిడ్ రేంజ్ మోడల్ మీద రూ.60 వేల డిస్కౌంట్లు లభిస్తాయి. గతేడాది మార్కెట్లో ఆవిష్కరించిన టాటా పంచ్ ఈవీపై రూ.10 వేల డిస్కౌంట్ ఆఫర్ చేసింది.