న్యూఢిల్లీ : ఓ న్యూజిలాండ్ కంపెనీ తమ ఉద్యోగులకు అపరిమిత సెలవులను ఆఫర్ చేసింది. హై ట్రస్ట్ మోడల్‌గా చెబుతున్న కంపెనీ తమ ఉద్యోగులకు వీలైనన్ని సెలవులు తీసుకునే వెసులుబాటు కల్పించింది. యాక్షన్స్టెప్ అనే ఈ కంపెనీ ఉద్యోగులకు ఏడాదిలో నెలరోజులు సెలవు తీసుకోవచ్చని వెల్లడించింది. సిబ్బందిని సంతోషంగా ఉంచే ఉద్దేశంతో అక్ల్యాండ్ కంపెనీ ఉద్యోగులకు భారీ సెలవులను అనుమతించింది.
లింక్డిన్, నెట్‌ఫ్లిక్స్ సైతం ఈ మోడల్‌ను ప్రయోగ పద్ధతిలో అనుసరించాయి. కొన్నేండ్ల కిందట మరో న్యూజిలాండ్ కంపెనీ రాకెట్వర్క్జ్ తమ ఉద్యోగులకు అపరిమిత వార్షిక, సిక్ లీవులను ఆఫర్ చేసింది. వారానికి నాలుగు రోజుల పనిదినాలపై కసరత్తు చేయాలని ప్రధాని జకింద అర్డెర్న్ సూచన మేరకు ఉద్యోగులకు పనిలో వెసులుబాటు దిశగా కంపెనీలు దృష్టిసారించాయి. ఇక వారానికి నాలుగు పనిదినాల కాన్సెప్ట్‌కు అనుగుణంగా యూనిలివర్ న్యూజిలాండ్ గత ఏడాది తమ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది.
మహమ్మారి సమయంలో లక్షలాది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్న సమయంలో వారానికి నాలుగు పనిదినాల కాన్సెప్ట్‌కు మద్దతు లభించింది. ఉత్పత్తిని పెంచేందుకు పని గంటల నుంచి సామర్ధ్యం పెంపు దిశగా ఈ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయని యూనిలివర్ న్యూజిలాండ్ తెలిపింది. ఉద్యోగులు తక్కువ పనిచేసినా వారికి పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించామని కంపెనీ ప్రకటించింది.