Hero Super Splendor New XTEC | హీరోమోటో కార్ప్ తాజాగా దేశీయ మార్కెట్లోకి న్యూ ఎక్స్‌టెక్ వర్షన్ సూపర్ స్ప్లెండర్ 125సీసీ బైక్ తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.83,368గా నిర్ణయించింది. లీటర్ పెట్రోల్‌పై 68 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ మూడు కలర్ ఆప్షన్స్- గ్లాస్ బ్లాక్, కాండీ బ్లేజింగ్ రెడ్, మ్యాట్టీ యాక్సిస్ గ్రే రంగుల్లో లభిస్తుంది.