న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టయోటా..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్‌ను విడుదల చేసింది. 2025 టయోటా కమ్రీ నయా వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.48 లక్షలుగా నిర్ణయించింది. డిజైన్, అప్‌గ్రేడ్ ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ మాడల్ స్కోడాకు చెందిన మాడల్‌కు పోటీగా విడుదల చేసింది. 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, యూఎస్బీ, సీ-టైప్ చార్జింగ్ పాయింట్స్, వైర్లెస్ చార్జింగ్, జేబీఎల్ 9 స్పీకర్ ఆడియో సిస్టమ్, 4జీ కనెక్టివిటీతో వై-ఫై, 2.5 లీటర్ల హైబ్రిడ్ ఇంజిన్‌తో తయారు చేసింది.