Federal Bank Rupay credit card | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘ఫెడరల్ బ్యాంక్’.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సహకారంతో రూపే వేవ్ క్రెడిట్ కార్డు (Rupay Wave Credit Card)ను ఆవిష్కరించింది. తమ కస్టమర్లకు యూపీఐ ఆధారిత చెల్లింపుల సౌకర్యార్థం ఈ క్రెడిట్ కార్డు తీసుకొచ్చినట్లు ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. దీనివల్ల రూపే నెట్ వర్క్ వృద్ధి చెందుతుందన్నది. యూపీఐ పేమెంట్స్ కోసం రూపే క్రెడిట్ కార్డుల వల్ల నిరంతరాయ సేవలతో బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి. ఫెడరల్ రూపే వేవ్ క్రెడిట్ కార్డుతో ప్రతి ఐదు యూపీఐ లావాదేవీలపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. మూడు నెలల్లో రూ.50 వేలు ఖర్చు చేస్తే 1000 బోనస్ పాయింట్లు లభిస్తాయి. ప్రతి 200 ఖర్చుపై ఒక రివార్డు పాయింట్లు లభిస్తుంది.