హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రిలీఫ్.. ఓడీ ఫెసిలిటీ.. ఇవీ డిటైల్స్!
HDFC Bank 'Relief' | కరోనాతో బుల్లి వ్యాపారాలు మొదలు కార్పొరేట్ స్థాయి బిజినెస్‌లు దెబ్బ తిన్నాయి. ప్రత్యేకించి చిన్న రిటైల్ వ్యాపారులు, షాప్ .....

న్యూఢిల్లీ: కరోనాతో బుల్లి వ్యాపారాలు మొదలు కార్పొరేట్ స్థాయి బిజినెస్‌లు దెబ్బ తిన్నాయి. ప్రత్యేకించి చిన్న రిటైల్ వ్యాపారులు, షాప్ కీపర్లు కోలుకోలేని దెబ్బ తిన్నారు. వారిని నగదు కొరత వెంటాడుతున్నది. ఈ తరుణంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు.. చిన్న వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది.
అందుకోసం నూతన స్కీమ్ ప్రారంభించింది. ఆరు నెలల బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ఆధారంగా రూ.10 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) ఫెసిలిటీ కల్పించింది. సీఎస్సీ ఎస్పీవీ భాగస్వామ్యంతో హెచ్డీఎఫ్సీ ఈ స్కీమ్అందుబాటులోకి తెచ్చింది.
షాప్ కీపర్స్ ఓవర్‌డ్రాఫ్ట్ స్కీమ్..
ఈ పథకానికి షాప్ కీపర్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్ అని పేరు కూడా పెట్టింది. నగదు కొరతను ఎదుర్కొంటున్న చిన్న షాప్ కీపర్లు, వ్యాపారులు ఈ పథకం సాయంతో లబ్ధి పొందొచ్చు.
మూడేండ్లుగా బిజినెస్ నడిపిన వారికి ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది. సదరు వ్యాపారుల బ్యాంకు ఖాతా ఆరు నెలల స్టేట్ మెంట్ ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు.
నో నీడ్ గ్యారంటీస్..
ఈ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్‌కు ఎటువంటి గ్యారంటీ, సెక్యూరిటీలు సమర్పించాల్సిన అవసరం లేదు. సంబంధిత వ్యక్తి ఐటీ రిటర్న్స్ గానీ, బిజినెస్ టాక్స్ రిటర్న్స్ కానీ దాఖలు చేయనవసరం లేదు.
రిటైల్ వ్యాపారులు, షాప్ కీపర్లు, గ్రామీణ వ్యాపారులు ఈ పథకానికి అర్హులు. అతి తక్కువ కాలంలో ఈ ఫెసిలిటీని వ్యాపారులు వినియోగించుకోవచ్చు. ఈ పథకం కింద ఓవర్‌డ్రాఫ్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అతి తక్కువ పత్రాలు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
ఆరేండ్లలోపు 7.5 లక్షలు.. దాటితే 10 లక్షలు
ఆరేండ్ల లోపు బిజినెస్ నడుపుతున్న షాప్ కీపర్లు రూ.7.5 లక్షలు.. ఆరేండ్లు దాటిన వారు రూ.10 లక్షల వరకు ఓడీ ఫెసిలిటీ పొందేందుకు అర్హులు. దేశంలోని 600 పై చిలుకు బ్యాంకు శాఖలు మేనేజ్మెంట్ మద్దతుతో ఈ పథకం వ్యాపారులకు అందుబాటులోకి చేయడానికి సహకరించనున్నాయి.
వీరు కూడా అర్హులే..
వ్యాపారం ప్రొపరైటర్లు, వ్యాపార భాగస్వాములు కూడా దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్స్ గవర్నమెంట్ అండ్ ఇన్స్ట్యూషనల్ బిజినెస్ హెడ్ స్మిత భగత్ స్పందిస్తూ గతేడాది కరోనా మహమ్మారి వల్ల ప్రతికూల వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.
కోవిడ్ వల్ల చిన్న వ్యాపారులు కుదేలయ్యారు. వ్యాపారాలు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎస్సీ సహకారంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. షాప్ కీపర్లు, చిన్న వ్యాపారుల కోసం ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది.
అన్ని బ్యాంకుల మేనేజర్లకు ఇలా ఆర్బీఐ
ఖాతాదారుడి డిపాజిట్లు, చెల్లింపుల హిస్టరీని పరిగణనలోకి తీసుకుని కొద్ది మొత్తంలో ఓవర్‌డ్రాఫ్ట్ చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్ స్థాయిలో అన్ని బ్యాంకులను ఆర్బీఐ అనుమతించింది. ఈ ఫెసిలిటీ కరంట్ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది.
ఇవి కూడా చదవండి..
రెండు కంపెనీల మధ్య టెక్నాలజీ వివాదం
ఈ నెల 31 న భారత్-చైనా మధ్య 12వ రౌండ్ చర్చలు
నార్వేలో జోరుగా ఉల్కాపాతం.. వెబ్ కెమెరాలో రికార్డ్
కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి నివాళి
చరిత్రలో ఈ రోజు.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

