కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి నివాళి
కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన భారతదేశం సైనికులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాళులర్పించారు.

శ్రీనగర్ : కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన భారతదేశం సైనికులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాళులర్పించారు. బారాముల్లా జిల్లాలోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద సోమవారం ఉదయం రామ్‌నాథ్ కోవింద్ పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళుర్పించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ఆదివారం జమ్ముకశ్మీర్ వచ్చారు.
తొలుత రాష్ట్రపతి కోవింద్.. లఢక్ ద్రాస్ సెక్టార్లో పర్యటించి కార్గిల్ అమరవీరులకు నివాళులర్పిస్తారని రాష్ట్రపతి భవన్‌తోపాటు సైన్యాధికారులు ముందు తెలిపారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో బారాముల్లాలోని కార్గిల్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్గిల్‌లోని ఎత్తైన కొండలను ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ చేసిన కుట్రలను తిప్పికొట్టడంలో దాదాపు 527 మంది భారతదేశం జవాన్లు అమరవీరులయ్యారు. వీరిని స్మరించుకుంటూ జాతియావత్తు ఇవాళ కార్గిల్ విజయ్ దివాస్‌ను జరుపుకుంటున్నది. నాలుగు రోజుల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి కోవింద్.. ద్రాస్ సెక్టార్‌కు వెళ్లేందుకు సిద్ధమవగా, వాతావరణం అనుకూలించడం లేదంటూ సైన్యం ఆయన ప్రయాణానికి అనుమతించలేదు. దాంతో బారాముల్లాలోని కార్గిల్ అమరవీరుల స్థూపం వద్ద ఆయన పుష్ఫగుచ్ఛం ఉంచారు.
ఇవి కూడా చదవండి..
చరిత్రలో ఈ రోజు.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
3 డీ ప్రింటింగ్‌తో కృత్రిమ చెవులు, ముక్కు సృష్టి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

