Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Sonia Gandhi meets Lalu Yadav | ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్నట్లు వారు వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్నట్లు వారు వెల్లడించారు. (Sonia Gandhi meets Lalu Yadav) సోమవారం ఢిల్లీలోని ఆర్జేడీ ఎంపీ మీసా భారతి నివాసంలో లాలూను సోనియా గాంధీ కలిశారు. ఈ విషయాన్ని ఎక్స్ పోస్ట్ ద్వారా లాలూ తెలిపారు. ‘గౌరవనీయులైన సోనియా గాంధీ మా నివాసానికి వచ్చి, నా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాత రోజులకు సంబంధించిన జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొచ్చాయి’ అని పేర్కొన్నారు.
కాగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో యువత, రైతులు, సైనికులు, సామాన్యుల కోసం పారదర్శకమైన ప్రజా సంక్షేమ పథకాలను తాము అమలు చేశామని లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఆర్టీఈ, ఆర్టీఐ వంటి చట్టాల ద్వారా దేశ ప్రజలను శక్తివంతులను చేశామని ఆయన గుర్తు చేశారు. ‘మన్మోహన్ సింగ్ నాయకత్వంలో బీహార్ అభివృద్ధి కోసం లక్షా నలభై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను మేం అందించాం’ అని ఆ పోస్ట్‌లో లాలూ పేర్కొన్నారు.
మరోవైపు ఆర్జేడీ నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ సందర్భంగా అక్కడ ఉన్నారు. సాధారణ వైద్య పరీక్షల కోసం లాలూ ఢిల్లీకి వచ్చినట్లు తేజస్వీ యాదవ్ తెలిపారు. ‘నిన్న నేను సోనియా జీని కలిసినప్పుడు ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశా. ఆమె స్వయంగా లాలూ జీని కలవాలని కోరుకున్నారు. అందుకే ఈ రోజు ఆయనను పరామర్శించడానికి వచ్చారు’ అని అన్నారు.
అయితే తమ కుటుంబాల మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేజస్వీ యాదవ్ గుర్తు చేశారు.
‘కష్టకాలంలో లాలూ జీ, సోనియా జీ ఒకరికొకరు అండగా నిలిచారు. వీరిద్దరూ కలుసుకుని చాలా కాలం కావడంతో, సోనియా జీ ఈరోజు ఆయనను కలిసేందుకు వచ్చారు’ అని చెప్పారు.
కాగా, ఓట్ల చోరీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలన్న డిమాండ్‌తో ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభను ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నిర్వహించింది. ఆ మరునాడే సోనియా గాంధీ, లాలూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
आदरणीय मैडम श्रीमती सोनिया गांधी जी ने आवास पहुँच स्वास्थ्य संबंधी जानकारी प्राप्त की। इस दौरान पुराने दिनों की यादें ताजा हुई।
स्मरण किया कि कैसे UPA सरकार के दिनों में हम लोगों ने युवाओं, किसानों, जवानों और आम आदमी के लिए पारदर्शी व जनकल्याणकारी योजनाएं लागू की तथा मनरेगा, RTE, RTI जैसी कानूनों से देशवासियों को सशक्त किया गया। सरदार मनमोहन सिंह जी के नेतृत्व में बिहार के विकास के लिए हम लोगों ने कैसे 1 लाख 45 हज़ार करोड़ से अधिक की धनराशि दी।
— Lalu Prasad Yadav (@laluprasadrjd) November 2, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- governance
- Lalu Yadav
- leaders
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
Raptadu case | రాప్తాడు నిందితుడిపై కాల్పుల ఘటనపై ఏపీ హైకోర్టులో పిటిషన్
AP News | ముంచుకొస్తున్న ‘మురసు’.. ఏపీ సర్కారు అప్రమత్తం.. విద్యాసంస్థలకు సెలవు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

