ప్రపంచంలోని రెండు ప్రసిద్ధ ఆటోమొబైల్ కంపెనీలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. ఈ రెండు కంపెనీలు ఒక సాంకేతిక పరిజ్ఞానం కోసం కేసులు పెట్టుకుంటున్నాయి. తన కో పైలట్ 360 ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టంకు ‘బ్లూ క్రూయిస్’ అని పేరు పెట్టడంపై ఫోర్డ్ మోటార్ కంపెనీపై జనరల్ మోటార్స్ కేసు నమోదు చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో.. కంపెనీ కాలిఫోర్నియా జిల్లా కోర్టుకు విన్నవించింది. అయితే దీనిపై ఇంతవరకు ఫోర్డ్ సంస్థ ఎలాంటి స్పందన తెలుపలేకపోవడం విశేషం.
ఫోర్డ్ ఏమి తప్పు చేస్తున్నదో వారికి తెలుసునని జనరల్ మోటార్స్ తెలిపింది. వారు ఈ టెక్నాలజీని ఉపయోగించాలనుకుంటే జనరల్ మోటార్స్ పదం ‘క్రూయిజ్’ ను ఉపయోగించకూడదని జీఎం సంస్థ వాదిస్తున్నది. జనరల్ మోటార్స్ మొదట సూపర్ క్రూయిజ్ ఫీచర్‌ను విడుదల చేసింది. దీనిలో డ్రైవర్ స్టీరింగ్ నుంచి కొంత సమయం వరకు వీడి ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కారును ఆటోమేటిక్ మోడ్‌లో ఉంచవచ్చు. ఈ లక్షణాలను జనరల్ మోటార్స్ ప్రస్తుతం తన చాలా వాహనాల్లో ఉపయోగిస్తున్నది. గత ఏడాది యూఎస్‌లో అత్యధికంగా అమ్ముడైన ఎఫ్-150 పికప్ ట్రక్కులో ‘బ్లూ క్రూయిస్’ హ్యాండ్స్‌ఫ్రీ డ్రైవింగ్ ఫీచర్‌ను ఫోర్డ్ ఉపయోగించడం విశేషం.
ఈ నెల 31 న భారత్-చైనా మధ్య 12వ రౌండ్ చర్చలు
నార్వేలో జోరుగా ఉల్కాపాతం.. వెబ్ కెమెరాలో రికార్డ్
కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి నివాళి
చరిత్రలో ఈ రోజు.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
3 డీ ప్రింటింగ్‌తో కృత్రిమ చెవులు, ముక్కు సృష్టి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..