నార్వేలో జోరుగా ఉల్కాపాతం.. వెబ్ కెమెరాలో రికార్డ్
నార్వేలో ఉల్కాపాతం కనిపించింది. ఆకాశంలో పెద్ద శబ్దాలతో కండ్లు మిరుమిట్లు గొలిపే వెలుతురు రికార్డయింది. ఉల్కాపాతం కొన్ని భాగాలు ఓస్లో సమీపంలో పడిపోయి ఉండవచ్చునని నిపుణులు అంటున్నారు

ఓస్లో : నార్వేలో ఉల్కాపాతం కనిపించింది. ఆకాశంలో పెద్ద శబ్దాలతో కండ్లు మిరుమిట్లు గొలిపే వెలుతురు రికార్డయింది. ఉల్కాపాతం కొన్ని భాగాలు ఓస్లో సమీపంలో పడిపోయి ఉండవచ్చునని నిపుణులు అంటున్నారు. ఉల్కాపాతం కారణంగా ఎటువంటి నష్టం జరుగలేదని సమాచారం. ఆకాశంలో ఉల్కాపాతం ఉరుములను విన్నట్లుగా స్థానికులు చెప్తున్నారు.
ఓస్లో నుంచి 60 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 1 గంటల సమయంలో ట్రోండ్‌హీమ్ నగరం సమీపంలో ఉల్కపాతంను చూసిన వార్తలు వచ్చాయి. హోల్మ్స్ట్రాండ్ పట్టణంలో ఏర్పాటు చేసిన వెబ్ కెమెరాల్లో ఆకాశం నుంచి పడుతున్న అగ్నిగోళాలు రికార్డయ్యాయి. ఉల్కాపాతం మూలాన్ని, అది ఎక్కడ పడిపోయిందో తెలుసుకోవడానికి నార్వే శాస్త్రవేత్తలు ఉల్కాపాతం వీడియో ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. ఓస్లో నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైన్మార్కాలోని అడవుల్లో ఉల్క పడిపోయి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఉల్క పతనం చూసిన ఉల్కాపాతం నెట్‌వర్క్‌కు చెందిన మోర్టెన్ బిల్లిట్.. ఇది చాలా వేగంగా జరిగిందని, 5-6 సెకన్ల పాటు మెరిసిందని, ఉల్క సెకనుకు 15-20 కిలీమీటర్ల వేగంతో కదిలిందని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా దాని శిధిలాలు గుర్తించ లేదు. సంభావ్య ఉల్కలను కనుగొనటానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టవచ్చని బిల్లెట్ చెప్పారు. ఆదివారం రాత్రి అంగారకుడు-బృహస్పతి మధ్య నుంచి అతిపెద్ద ఉల్క వెళ్తుందని భావించినట్లు బిల్లెట్ తెలిపారు. 2013 లో, రష్యాలోని చెలియాబిన్స్క్ నగరానికి సమీపంలో ఒక ఉల్క పడటంతో 1200 మంది గాయపడ్డారు. అనేక భవనాలు దెబ్బతిన్నాయి.
ఇవి కూడా చదవండి..
కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి నివాళి
చరిత్రలో ఈ రోజు.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
3 డీ ప్రింటింగ్‌తో కృత్రిమ చెవులు, ముక్కు సృష్టి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

