‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
కాంగ్రెస్ ప్రభుత్వ గత మూడు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు దోకాకు గురయ్యాయని ముఖ్యంగా విద్యార్థి, నిరుద్యోగ, యువతకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు కాలేదని,. ఇక జాబ్ నోటిఫికేషన్ల ఊసే లేదని త్వరలో జరగనున్న వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో...
– రాక్షస ప్రభుత్వంలో నిరుద్యోగులకు నిరాశ
– నిశ్శబ్ద విప్లవం తెచ్చే బాధ్యత పట్టభద్రులదే
– రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్నదాత అగచాట్లు
– ఐదు లక్షల ఓట్లు పెంచిన ఘనత పార్టీ శ్రేణులదే
– కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం, బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
కోదాడ, నవంబర్ 02 : కాంగ్రెస్ ప్రభుత్వ గత మూడు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు దోకాకు గురయ్యాయని ముఖ్యంగా విద్యార్థి, నిరుద్యోగ, యువతకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు కాలేదని,. ఇక జాబ్ నోటిఫికేషన్ల ఊసే లేదని త్వరలో జరగనున్న వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వ చెంప చెల్లుమనిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి పట్టభద్రులకు పిలుపునిచ్చారు. సోమవారం కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎన్నికల పరిశీలకుడు తిప్పన విజయసింహారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా విద్యారంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని బడుగు, బలహీన వర్గాల కుటుంబాల పిల్లలు చదువుల కోసం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
విద్యావంతులు, మేధావులు వాస్తవ పరిస్థితులను గమనంలోకి తీసుకుని ఓటు అనే ఆయుధంతో ప్రజాదరణ కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి పట్టభద్రుడు విధిగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసిన డబ్బును అధికార ప్రభుత్వం నమ్ముకుంటే మనం నిజాయితీని నమ్ముకున్నామనిఈ పరిణామంలో ప్రభుత్వ దుశ్చర్యలను నిలువరించేందుకు నిశ్శబ్ద విప్లవం తెచ్చే బాధ్యత పట్టభద్రులపైనే ఉందన్నారు. గత ఉప ఎన్నికల్లో 4 లక్షల పైకి ఓట్లు నమోదు కాగా ఇప్పుడు ఐదు లక్షలకు పైగా ఓట్ల నమోదును పెంచిన ఘనత పార్టీ శ్రేణులు అన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ అమలకు సాధ్యం కానీ హామీలను ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పట్టభద్రులు తమ ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. సాగునీరు విద్యుత్తు లేక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారని, బీఆర్ఎస్ హయాంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ లోను సాగునీరు అందించి రైతులను ఆదుకున్న ఘనత బీ ఆర్ఎస్ దేనిని స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలకులు తిప్పిన విజయసింహారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నమోదు ప్రక్రియకు మరో వారం రోజులు అవకాశం ఉన్నందున నమోదు పెంచేందుకు కృషి చేయాలి అన్నారు.. అనంతరం ఓట్ల నమోదు ప్రక్రియపై ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రమేష్, నర్సిరెడ్డి, భూపాల్ రెడ్డి, శీలం సైదులు, జానకి, రామాచారి, సుంకర అజయ్ కుమార్, కిరణ్, శివాజీ, ఎస్కే నయీమ్, కంది బండ సత్యనారాయణ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

