PAN Card – Aadhar | ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. పాన్ కార్డు దారులంతా వచ్చేనెల 31 లోపు ఆధార్ కార్డులతో అనుసంధానించుకోవాలని ప్రజలను కోరింది. గడువు లోపు ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే పాన్ కార్డు డియాక్టివేట్ కావడంతోపాటు ఇతర సమస్యలకు దారి తీస్తుంది. 2 కార్డులను అనుసంధానించకుంటే పాన్ కార్డు డియాక్టివేట్ కావడంతోపాటు తదుపరి ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురు కావడంతోపాటు దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కష్టం.
పలు ఫిన్ టెక్ సంస్థలు వినియోగదారుల అనుమతి లేకుండానే కస్టమర్ ప్రొఫైల్ రూపకల్పనకు వారి పాన్ కార్డు సమాచారాన్ని వినియోగిస్తున్నాయి. ఆర్థిక మోసాల కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. సున్నితమైన వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు పాన్ కార్డు దారుల వ్యక్తిగత వివరాల యాక్సెస్ పరిమితం చేయాలని ఆదాయం పన్ను విభాగాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.