న్యూఢిల్లీ, మే 21: దేశీయంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా సరికొత్త మాడల్‌ను తీసుకొచ్చింది. ఎంజీ విండ్సర్ ఎక్స్‌క్లూజివ్ ప్రో రకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ.17.24 లక్షలుగా నిర్ణయించింది.
52.9 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 449 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కంపెనీకి ఉన్న డీలర్ల వద్ద రూ.11 వేలు ముందస్తుగా చెల్లించి ఈ వాహనాన్ని బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది.