iPhone 16 -Discount | ఈ నెల తొమ్మిదో తేదీన ఆపిల్ ఆవిష్కరించిన నూతన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లు – ఐ-ఫోన్ 16, ఐ-ఫోన్ 16 ప్లస్, ఐ-ఫోన్ 16 ప్రో, ఐ-ఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ల సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఆపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ కింద ఐ-ఫోన్ 16 ఫోన్ మీద ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. పాత ఐ-ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద గణనీయ రాయితీ లభిస్తుంది. ఆయా మోడల్ ఫోన్లు, వాటి పరిస్థితిని బట్టి ఎక్స్చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఐ-ఫోన్ 16 కొనుగోలు దారులకు స్టోరేజీ కెపాసిటీ, బ్యాటరీ హెల్త్ తదితర పరిస్థితులను బట్టి పాత ఐ-ఫోన్ మీద గరిష్టంగా రూ.37,900లకు లభిస్తుంది. ఐ-పోన్ 16 ఫోన్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ లాంచింగ్ ధర రూ.79,900. ఆపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ కింద ఐ-ఫోన్ 12 ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ వర్తించకపోతే ఆ ఫోన్లను ఉచితంగా ఆపిల్ రీసైక్లింగ్ చేసి అందజేస్తుంది.
ఐ-ఫోన్ 15 ఫోన్ రూ.79,900లకు లాంచ్ చేసినా ప్రస్తుతం రూ.69,900లకు లభిస్తుంది. ఐ-ఫోన్ 16 కొనుగోలు కోసం ఐ-ఫోన్ 15ను ఎక్స్చేంజ్ చేస్తే ట్రేడ్ ఇన్ క్రెడిట్ ద్వారా రూ.37,900 డిస్కౌంట్ అందిస్తుంది. సదరు ఫోన్ స్టోరేజీ కెపాసిటీ, బ్యాటరీ హెల్త్ ఆధారంగా డిస్కౌంట్ లభిస్తుంది.
ఐ-ఫోన్ 14 యూజర్లు ఇప్పుడు ఐ-ఫోన్ 16 కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. దీనిపై రూ.32,100 వరకు ఆపిల్ క్రెడిట్ ఇన్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఐ-ఫోన్ 14 ఫోన్ రూ.59,900లకు లభ్యం అవుతుంది.
మీరు మీ వద్ద ఉన్న ఐ-ఫోన్ 13 స్థానంలో కొత్త ఐ-ఫోన్ 16 కొనుగోలు చేయాలనుకున్నారా.. అయితే ఆపిల్ ట్రేడ్ ఇన్ ప్రోగ్రామ్ కింద రూ.31,000 క్రెడిట్ లభిస్తుంది. ఐ-ఫోన్ 12 యూజర్లు రూ.20,800 ట్రేడ్ ఇన్ వాల్యూ కింద డిస్కౌంట్ పొందొచ్చు.
ఆపిల్ ఐ-ఫోన్ 16 ఫోన్ కోసం యూజర్లు ముంబై, ఢిల్లీ నగరాల్లో సంస్థ స్టోర్ ముందు బారులు తీరారు. ముంబైలో భారీ వర్షం కురుస్తున్నా సుమారు 400-500 మంది క్యూ లైన్లో ఉన్నారని ఆపిల్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఢిల్లీలో ఉదయం ఎనిమిది గంటలకు స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సుమారు 200-300 మంది కస్టమర్లు క్యూలో ఉంటున్నారు. బ్లింకిట్, బీబీ నౌ వంటి క్విక్ కామర్స్ ప్లాట్ ఫామ్స్ పై ఆర్డర్లు అసాధారణ రీతిలో నమోదవుతున్నాయి. ఐ-ఫోన్ 15 కంటే ఐ-ఫోన్ 16 కొనుగోళ్లు 25 శాతం ఎక్కువ అని ఆపిల్ వర్గాల కథనం.