జకార్తా : పలు వారాలుగా టీజర్ ఇమేజ్‌లతో ఆసక్తి రేపిన హోండా మోటార్ కంపెనీ సబ్సిడరీ పీటీ హోండా ప్రాస్పెక్ట్ మోటార్ ఎట్టకేలకు న్యూ హోండా ఎస్యూవీ ఆర్ఎస్ కాన్సెప్ట్‌ను వెల్లడించింది. ఈ ఎస్యూవీ భారత్‌లో లాంఛ్ అయితే అది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషక్, వోక్స్వ్యాగన్ టైగున్, ఎంజీ ఆస్టర్, నిసాన్ కిక్స్, రెనాల్ట్ డస్టర్లకు దీటైన పోటీ ఇవ్వనుంది.
హోండా సిటీ, హోండా బీఆర్-వీ ప్లాట్‌ఫాంలపై రూపొందిన ఈ ఎస్యూవీ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో భారత్ మార్కెట్లో ఎంటర్ కానుంది. ఇండోనేషియా లాంఛ్ అనంతరం ఇతర మార్కెట్లలోకి హోండా ఎస్యూవీ ఆర్ఎస్ రానుంది.