Toyota New Land Cruiser | 1న గ్లోబల్ మార్కెట్లోకి టయోటా లాండ్ క్రూయిజర్ ప్రాడో.. భారత్‌కు వచ్చే ఏడాది
Toyota New Land Cruiser Prado | టయోటా కిర్లోస్కర్స్ మోటార్స్ (టీకేఎం) మరో ఎస్యూవీ కారు న్యూ లాండ్ క్రూయిజర్ ప్రాడోను గ్లోబల్ మార్కెట్లలో మంగళవారం ఆవిష్కరిస్తారు. నార్త్ అమెరికా మార్కెట్లో దీన్ని లాండ్ క్రూయిజర్‌గా పిలుస్తారు. మిగతా మార్కెట్లలో మాత్రం లాండ్ క్రూయిజర్ ప్రాడోగా పరిగణిస్తారు.
Toyota New Land Cruiser | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ నుంచి న్యూ జనరేషన్ లాండ్ క్రూయిజర్ ప్రాడో.. మంగళవారం గ్లోబల్ మార్కెట్లకి రానున్నది. అమెరికా మార్కెట్లో తొలిసారి లాండ్ క్రూయిజర్ పేరుతో విక్రయించనున్నారు. నార్త్ అమెరికా మార్కెట్లలో దీన్ని లాండ్ క్రూయిజర్ మోడల్ గానే కొనసాగించినా.. ఇతర మార్కెట్లలో లాండ్ క్రూయిజర్ ప్రాడోగా పిలుస్తారు. భారత్ మార్కెట్లోకి వచ్చే ఏడాది తీసుకొస్తారని సమాచారం.
లెక్సస్ జీఎక్స్, న్యూ లాండ్ క్రూయిజర్ మోడల్ కార్ల మధ్య సారూప్యతలు ఉన్నా ప్రధాన ఫీచర్లలో మార్పులు జరుగుతాయని తెలుస్తున్నది. న్యూ లాండ్ క్రూయిజర్ కారు బచ్, స్క్వేర్డ్ డిజైన్ కలిగి ఉంటుంది. న్యూ టయోటా లాండ్ క్రూయిజర్ ప్రాడో తన లెక్సస్ బ్రాండెడ్ మోడల్ లెక్సస్ జీఎక్స్ను పోలి ఉంటుంది. మెష్-టైప్ గ్రిల్లె విత్ రెక్టాంగులర్ హెడ్ ల్యాంప్స్‌తో లాండ్ క్రూయిజర్ ప్రాడో ఎస్యూవీ వస్తుందని టయోటా కిర్లోస్కర్ ధ్రువీకరించింది.
లెక్సస్ జీఎక్స్ మాదిరిగానే న్యూ లాండ్ క్రూయిజర్ ప్రాడోలో టయోటా టీఎన్జీఏ-ఎఫ్ ప్లాట్ ఫామ్ వినియోగించింది. న్యూలైట్ బ్లూ కలర్ పెయింట్ స్కీమ్, చంకీ ఫ్రంట్ గ్రిల్లే విత్ ది ‘టయోటా’ లెటరింగ్, బ్లడ్ లుకింగ్ రెక్టాంగులర్ హెడ్ ల్యాంప్స్, అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్, వెర్టికల్లీ స్టాక్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ తదితర ఫీచర్లు ఉంటాయి. లెక్సస్ జీఎక్స్లో వలే హైబ్రీడ్ పవర్ ట్రైన్స్, పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్లతో వస్తుందని సమాచారం. లెక్సస్ జీఎక్స్ 3.4-లీటర్ల వీ6 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 349 బీహెచ్పీ విద్యుత్, 649 ఎన్ఎం టార్చిని వెలువరిస్తుంది. భారత్‌తోపాటు పలు మార్కెట్లలో టయోటా ఎస్యూవీ కార్లకు ఫుల్ గిరాకీ ఉంది. ఫుల్ సైజ్ ఎల్సీ300 మోడల్ కారు కోసం రెండేండ్లకు పైగా వేచి ఉండాల్సి వస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

