న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త మాడల్‌ను పరిచయం చేసింది. ఎక్స్‌యూవీ 300లో నూతన వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో ఈ కారు లభించనున్నది. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మాడల్‌లో 6 స్పీడ్ మాన్యువల్ గేర్లు ఉన్నాయి.
ఐదు రకాల్లో లభించనున్న ఈ కారు డబ్ల్యూ2 మాడల్ రూ.7.99 లక్షలు, డబ్ల్యూ4 రకం రూ.8.65 లక్షల నుంచి రూ.10.20 లక్షలలోపు, డబ్ల్యూ6 మాడల్ రూ.9.99 లక్షల నుంచి రూ.12.29 లక్షల లోపు, డబ్యూ8 మాడల్ రూ.11.49 లక్షల నుంచి రూ.14.59 లక్షల లోపు నిర్ణయించింది.