New Online Payments | జనవరి 1 నుంచి ఆన్లైన్ పేమెంట్స్‌కు కొత్త రూల్స్.. కస్టమర్లకు కష్టాలు తప్పవా?!
New Online Payments | వచ్చేనెల నుంచి ఆన్లైన్ పేమెంట్స్ పద్దతులు మారుతున్నాయి. టోకెనైజేషన్ పద్దతిలోకి వెళ్లాలని ఆర్బీఐ సూచించింది.

New Online Payments | ఐదేండ్ల క్రితం నోట్ల రద్దుతో ఆన్లైన్ పేమెంట్స్ మొదలయ్యాయి. కరోనా ప్రభావంతో ఆన్లైన్ పేమెంట్స్ మరింత పెరిగిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారు. ఇదే టైంలో సైబర్ మోసాల రిస్క్ కూడా ఎక్కువైంది. ఖాతాదారుల పేమెంట్స్ సురక్షితంగా జరిగేలా ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ఇందుకు కొత్త రూల్స్ రూపొందించింది. ఈ రూల్స్ 2022 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే మార్పులు చేస్తున్నామని బ్యాంకులు తమ ఖాతాదారులకు సమాచారం అందిస్తున్నాయి.
మర్చంట్ సైట్లకు ఆర్బీఐ ఇలా ఆదేశం
డేటా సెక్యూరిటీని బలోపేతం చేయడానికి కస్టమర్ల క్రెడిట్, డెబిట్ కార్డుల డేటాను తొలగించాలని అన్ని మర్చంట్స్ వెబ్సైట్లు, పేమెంట్ గేట్‌వే సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల డేటాకు బదులు సంబంధిత ఖాతాదారులకు బ్యాంకులు జారీ చేసే ఎన్క్రిప్టెడ్ (encrypted – నిక్షిప్త ) టోకెన్ల ఆధారంగా ట్రాన్సాక్షన్స్‌ను అనుమతించాలని సూచించింది.
మర్చంట్ సైట్లు, యాప్స్‌లో డేటా తొలగింపు ఇలా
మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు భద్రతను బలోపేతం చేసేందుకు మర్చంట్ వెబ్సైట్ లేదా యాప్‌లో సేవ్ చేసిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను మర్చంట్ వెబ్సైట్/యాప్‌ల నుంచి తొలగిస్తారు. ఇక నుంచి ఆన్లైన్ పేమెంట్స్ కోసం ఖాతాదారులు ప్రతి సారి పూర్తి వివరాలను ఎంట్రీ చేయడం గానీ, టోకెనైజేషన్‌ను ఎంచుకోవడం గానీ చేయాలి. ఇది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మొదలవుతుంది అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఖాతాదారులకు గతవారం ఎస్సెమ్మెస్ సందేశాలు పంపుతున్నది.
2020 మార్చిలోనే ఆర్బీఐ గైడ్‌లైన్స్
బ్యాంకుల ఖాతాదారుల డేటా భద్రతకు గతేడాది మార్చిలోనే ఆర్బీఐ గైడ్‌లైన్స్ జారీచేసింది. డేటా సెక్యూరిటీని పటిష్ఠ పరిచేందుకు మర్చంట్ వెబ్సైట్లు డెబిట్, క్రెడిట్ కార్డుల డేటాను సేవ్ చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. గత సెప్టెంబర్‌లో తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఏడాది చివరిలోగా నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఖాతాదారులకు టోకెనైజేషన్ ఆప్షన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తమ వద్ద ఉన్న డేటాను తొలగించాలని అన్ని మర్చంట్ వెబ్సైట్లు, యాప్స్‌లను ఆదేశించింది.
టోకెనైజేషన్ అంటే..
ఇప్పుడంతా ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. అయితే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రతి వ్యక్తి తన 16 నంబర్ల డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, కార్డు ఎక్స్పైరీ డేట్, సీవీవీలతోపాటు వన్‌టైం పాస్వర్డ్ లేదా ట్రాన్సాక్షన్ పిన్ నంబర్ నమోదు చేస్తే గానీ ఆన్లైన్ లావాదేవీలు పూర్తి కావు. ఆయా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఉండే సమాచారం సరిగ్గా నమోదు చేస్తేనే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రతి సారీ 16 అంకెల నంబర్‌తో సహా డిటైల్స్ అన్నీ ఇవ్వాలంటే కాసింత ఇబ్బందే. ఈ వివరాలన్నీ నమోదు చేయడానికి బదులు టోకెనైజేషన్ ఎంచుకుంటే ఖాతాదారులకు, మర్చంట్ వెబ్సైట్లకు వెసులుబాటుగా ఉంటుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలకు బదులు ఖాతాదారులకు బ్యాంకులు జారీ చేసే యునిక్ ఆల్టర్నేటివ్ కోడ్ (unique alternate code)నే టోకెన్ అంటారు.
జనవరి నుంచి జరిగే మార్పులేంటి..
జనవరి ఒకటో తేదీ తర్వాత ఏ మర్చంట్ వెబ్సైట్ నుంచి తొలి పేమెంట్ చేసినా మీరు సదరు మర్చంట్ వెబ్సైట్ లేదా యాప్‌కు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ)తో సమ్మతి తెలియజేయాలి. అందుకు మీరు ఒకసారి కార్డు సీవీవీ, ఓటీపీ నంబర్ ఆధారంగా పేమెంట్ చేయడం పూర్తి చేయాలి.
క్రెడిట్/డెబిట్ కార్డుదారులు ఏం చేయాలి
- మీరు ఒక మర్చంట్ వెబ్‌సైట్‌తో కొనుగోళ్లు ప్రారంభించాలి
- టోకెనైజేషన్ చేయడానికి మర్చంట్ వెబ్సైట్ మీ అనుమతి కోరుతుంది
- మీ ఆమోదం తెలుపగానే కార్డ్ నెట్‌వర్క్‌లోకి టోకెనైజేషన్ రిక్వెస్ట్ వెళ్లిపోతుంది.
- మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుకు బదులు కార్డ్ నెట్వర్క్.. ప్రాక్సీ మాదిరిగా టోకెన్ సృష్టించి.. మర్చంట్ వెబ్సైట్లకు పంపుతుంది.
- మరో మర్చంట్ వెబ్సైట్ నుంచి, మరో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నుంచి పేమెంట్ చేయాల్సి వచ్చినా మళ్లీ టోకెనైజేషన్ చేసుకోవాలి.
- ట్రాన్సాక్షన్లకు అనుగుణంగా మర్చంట్ వెబ్సైట్లో టోకెన్ సేవ్ అవుతుంది.
- సీవీవీ, ఓటీపీలతో మీ ట్రాన్సాక్షన్లు అప్రూవ్ చేసుకోవచ్చు.
టోకెనైజేషన్ సురక్షితమా..
ఎన్క్రిప్టెడ్ (నిక్షిప్త encrypted ) తరహాలో కార్డు డిటైల్స్ సేవ్ అయిన తర్వాత మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు డేటా బహిర్గతమయ్యే అవకాశాలు తగ్గుముఖం పడతాయి. మోసాల రిస్క్ తగ్గుతుంది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాల షేరింగ్‌కు బదులు టోకెన్ వాడితే మీ రిస్క్‌లు తగ్గిపోతాయి. యూజర్లకు సౌకర్యవంతం తోపాటు కార్డు ట్రాన్సాక్షన్లు మరింత సురక్షితం చేయడానికి ఈ ఇన్షియేటివ్ దోహద పడుతుందని భావిస్తున్నారు. 16 అంకెల డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్లను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టోకెనైజేషన్లోకి వెళ్లిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కూ కార్డ్ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదని ఆర్బీఐ చెబుతున్నది.
ఆర్బీఐ చెబుతున్నదేమిటి..
కార్డుల డిటైల్స్ స్టోర్ చేయాలని ఖాతాదారులను కొన్ని మర్చంట్ వెబ్సైట్లు బలవంతం చేస్తాయి. మర్చంట్ వెబ్సైట్ల వద్ద భారీ మొత్తంలో ఖాతాదారుల వివరాలు ఉంటే కార్డు డేటా చోరీ అయ్యే ప్రమాదం ఎక్కువ. గతంలో కొన్ని మర్చంట్ వెబ్సైట్లు స్టోర్ చేసుకున్న డిటైల్స్ లీకయ్యాయి. సోషల్ ఇంజినీరింగ్ టెక్నిక్‌లతో తస్కరణకు గురైన డేటాను మోసాలు చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆర్బీఐ తెలిపింది.
ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపులకు టోకెనైజేషన్ విధానం తేవడంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. కానీ టోకెనైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాతాదారులు తమ కార్డు పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. డిజిటల్ పేమెంట్స్ మరింత బలోపేతం చేయడానికి, సమర్థవంతంగా సురక్షితంగా సాగడానికి చర్యలు తీసుకుంటున్నాం అని పేర్కొన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Safe Online Transactions | ఈ టిప్స్ పాటిస్తే మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ సేఫ్.. లేదంటే గోవిందా..?
Shining Mask: కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
Signal | వాట్సప్‌కు దీటుగా దూసుకెళ్తున్న సిగ్నల్.. మరో అద్భుతమైన ఫీచర్
Fake PAN Card | నకిలీ పాన్‌కార్డును గుర్తించడం ఎలా? స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఇదిగో స్టెప్స్
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? వెంటనే అప్డేట్ చేసుకోండి.. ఆదేశించిన కేంద్రం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

