న్యూఢిల్లీ, జూన్ 18: ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో ఈ నెల (జూన్) 17నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతంతో పోల్చితే 14.64 శాతం పెరిగినట్టు తేలింది. అయితే కార్పొరేట్ల నుంచి అధిక అడ్వాన్స్ ట్యాక్స్ ఇందుకు దోహదం చేసినట్టు గురువారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.
ఇక నికర కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్ 22 శాతం పెరిగి రూ.2.08 లక్షల కోట్లుగా, నాన్-కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 8 శాతం పెరిగి దాదాపు రూ.2.94 లక్షల కోట్లుగా ఉన్నాయన్నది. సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ వసూళ్లు 45 శాతం వృద్ధి చెంది రూ.18,856 కోట్లకు, అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 15.30 శాతం ఎగిసి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి. అలాగే రిఫండ్స్ రూ.89,026 కోట్లుగా ఉన్నాయి. నిరుడుతో పోల్చితే 1.19 శాతం పెరుగుదల కనిపించింది.