Credit Card | బ్యాంకుల్లో, పెట్రోల్ బంకుల్లో, షాపింగ్ మాల్స్‌లో క్రెడిట్ కార్డ్ కావాలా? అంటూ అడిగితే.. ఊ కొడుతూ వెళ్లే ముందు ఇదికాస్త ఆలోచించుకోండి. మీరు తీసుకునే క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన నియమ, నిబంధనలను పూర్తిగా చదవడం మర్చిపోవద్దు. దానిపై పొందే నగదు మొత్తాలకుపడే వడ్డీరేట్లు, ఇతర ఫీజులు, చార్జీలను తెలుసుకోకుంటే నష్టపోతారు.
బ్యాంకింగ్ కస్టమర్ల ప్రయోజనార్థం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు సందేశాలను కూడా ఇస్తుండటం గమనార్హం. ఇక క్రెడిట్ కార్డ్‌ను పూర్తిస్థాయిలో వాడుకోకపోవడమే మంచిది. అలాగే వాడుకున్న మొత్తాలను కొద్దికొద్దిగా చెల్లించడం కాకుండా పూర్తిగా చెల్లిస్తేనే వడ్డీభారం పడబోదని గుర్తుంచుకోవాలి.